Telangana Corona News : తెలంగాణకు రిలీఫ్.. తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన రికవరీలు

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 33వేల 231 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 26వేల 704 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 416కి తగ్గింది.

Telangana Corona Cases

Telangana Corona News : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. క్రితం రోజుతో (338) పోలిస్తే కొత్త కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 21వేల 489 మందికి కరోనా పరీక్షలు చేయగా, 298 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 130 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 26 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 22 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 435 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 33వేల 231 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 26వేల 704 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 416కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 24వేల 113 మందికి కరోనా పరీక్షలు చేయగా, 338 మందికి పాజిటివ్ గా తేలింది.

 

తెలంగాణ కరోనా బులెటిన్..