తెలంగాణ Fact Check : తప్పుడు సమాచారం ఇచ్చారో తాట తీస్తారు

  • Published By: madhu ,Published On : April 7, 2020 / 01:41 AM IST
తెలంగాణ Fact Check : తప్పుడు సమాచారం ఇచ్చారో తాట తీస్తారు

Updated On : April 7, 2020 / 1:41 AM IST

దేశ వ్యాప్తంగా ఎన్నో ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారాలు వస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సీరియస్ గా పట్టించుకోరు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి మేరకు సీరియస్ గా పరిగణిస్తున్నాయి ప్రభుత్వాలు. భారతదేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొంతమంది దుర్మార్గులు తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తున్నారు.

కరోనా గురించి వస్తున్న తప్పుడు సమాచారం చేరవేస్తున్న వారి తాటతీసేందుకు తెలంగాణ సర్కార్ ఐటీ శాఖ రెడీ అయ్యింది. కొరడా ఝుళిపించింది. ఈ అసత్య ప్రచారం వల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్న నేపథ్యంలో కేసులు కూడా నమోదు చేస్తుండడం గమనార్హం. ఇందుకు ఐటీ శాఖ టెక్నాలజీని వినియోగిస్తోంది. నిజనిర్ధారణ వెబ్ సైట్ (ఫ్యాక్ట్ చెక్) ఏర్పాటు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం తప్పా కాదా ? అనేది తెలుసుకోవడానికి https://factcheck.telangana.gov.in/ ఉపయోగించవచ్చు.

వీటిపై గత వారం రోజుల వ్యవధిలో దాదాపు 200 ఫిర్యాదులు అందాయని, తప్పుడు సమాచారం చేరవేస్తున్న 25 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు కనిపిస్తున్నాయి. పాత వీడియోలు, ఫొటోలను తమకు అనుకూలంగా ఎడిట్ చేసి, ప్రస్తుతం ఉన్న అంశాలను జోడిస్తున్నారు.

ఇవి నిజమని కొంతమంది ప్రజలు భావిస్తున్నారు. దీనిపై కొన్ని కంప్లయింట్స్ అందాయి. కరోనాపై వస్తున్న తప్పుడు సమాచారం తప్పా ? కాదా ? అనేది విశ్లేషించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశించింది. దీంతో తెలంగాణ ఐటీ శాఖ ఈ వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చి ఫేక్ న్యూస్ కు..ఇలాంటి తప్పుడు సమాచారం చేస్తున్న వారిని కట్టడి చేస్తోంది. 

Also Read | మాస్క్‌లు, వెంటిలేటర్లు ఆర్డర్ చేయడానికి రెండు నెలలు వేచి ఉన్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్