BF 7 Omicron Sub Variant : BF 7వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం .. కొత్త మార్గదర్శకాలు

BF7 కోవిడ్ వేరియంట్ పై తెలంగాణ ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.

BF 7 Omicron Sub Variant : BF 7వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం .. కొత్త మార్గదర్శకాలు

BF 7 Omicron Sub Variant

Updated On : December 22, 2022 / 3:24 PM IST

BF 7 Omicron Sub Variant :  మూడేళ్ల క్రితం చైనాలో కోవిడ్ ఎంతగా కల్లోలం సృష్టించిందో ఇప్పుడు మరోసారి కోవిడ్ కొత్తగా తయారైన BF7 కోవిడ్ వేరియంట్ అంతకంటే ఎక్కువ హడలెత్తిస్తోంది. ఈ కొత్త వేరియంట్ ప్రభావరం ఇతరదేశాలకు కూడా వ్యాపించింది. భారత్ లో కూడా ఈ BF7 కోవిడ్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. BF7 కోవిడ్ వేరియంట్ పై తెలంగాణ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.

సమావేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించే అవకాశం ఉంది. దీంట్లో భాగంగా ఆరోగ్యశాఖ ఇప్పటికే అన్ని జిల్లాల్లోను ఆస్పత్రులను అలర్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి పెరుగుతుండటంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో థర్మల్ స్ర్కీనింగ్ చేయాలని నిర్ణయించారు.ఎయిర్ పోర్టులో ప్రయాణికుల స్క్రీనింగ్ తో పాటు పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని నిర్ణయించింది. దీనికి అవసరమైన చర్యలు తీసుకోనుంది తగిన .జాగ్రత్తలు తీసుకుంటే భయపడాల్సిన అవరసరం లేదని ఆరోగ్యశాఖ సూచించింది.అలాగే మాస్కులు తప్పనికానున్నాయి.

కాబట్టి రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాల్సిన అవసరం చాలా ఉంది.ఏదిఏమైనా ముందు జాగ్రత్తలు అనేవి పెను ప్రమాదంనుంచి బయటపడేస్తాయనే విషయం అందరు గుర్తించాలి.తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం