Telangana Govt schools : ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం
ప్రైవేటు స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు అధ్యయనం చేయాలని, విధివిధానాల రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది....

Govt Schools
English Medium In Govt schools : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో ఈ విధానం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతంపై సీఎం కేసీఆర్ ప్రభుత్వం దృష్టి సారించింది. 2022, జనవరి 17వ తేదీ సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. అందులో పలు అంశాలపై చర్చిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే సంవత్సరం నుంచి ఇంగ్లీషు బోధన చేయాలని నిర్ణయం తీసుకుంది.మన ఊరు మన బడి కార్యక్రమం కింద రూ. 7 వేల 289 కోట్లు కేటాయించింది.
Read More : Omicron Karnataka : కర్నాటకలో కొత్తగా 287 ఒమిక్రాన్ కేసులు
ప్రైవేటు స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు అధ్యయనం చేయాలని, విధివిధానాల రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతనలో ఏర్పాటైన కమిటీలో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సభ్యులుగా ఉండనున్నారు.