Dussehra holidays : విద్యా సంస్థలకు 13 నుంచి దసరా సెలవులు.. ఎప్పటి వరకు అంటే?

తెలంగాణలో విద్యా సంస్థలకు ప్రభుత్వం బతుకమ్మ, దసరా సెలవులను ప్రకటించింది. దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 13 నుంచి ..

Dussehra holidays : విద్యా సంస్థలకు 13 నుంచి దసరా సెలవులు.. ఎప్పటి వరకు అంటే?

Dussehra holidays

TS Dussehra holidays : తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. తెలంగాణలో అక్టోబర్ 24వ తేదీన దసరా పండుగను జరుపుకోనున్నారు. అక్టోబర్ 22న దుర్గాష్టమి అదే రోజు బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు, కార్యాలయాలకు ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటించింది. ముఖ్యంగా విద్యా సంస్థలకు 13రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

Read Also : నారీ పూజ.. విష్ణు మాయ ఆలయంలో కుష్బూకి పూజలు చేసిన పూజారులు..

తెలంగాణలో విద్యా సంస్థలకు ప్రభుత్వం బతుకమ్మ, దసరా సెలవులను ప్రకటించింది. దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 13 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈనెల 25వ తేదీ వరకు అంటే 13 రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది.

Read Also : ముంబయిలో మహేంద్ర సింగ్ ధోనీతో రామ్ చరణ్.. మరోసారి ఇరువురి ఫ్యాన్స్ కు పండుగేనా?

మరోవైపు ఇంటర్మీడియట్ కాలేజీలకు ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు సెలవులు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఈ సెలవులను పాటించాలని విద్యాశాఖ సూచించింది.