Tenth Exams Results : టెన్త్‌ పరీక్షల ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా కేసులు పెరుగుతుండడంతో టెన్త్ పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ సర్కార్.. ఫలితాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎస్ సీ బోర్డు నిర్ణయించే ఆబ్జెక్టివ్ విధానంగా ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది.

Tenth exams results : కరోనా కేసులు పెరుగుతుండడంతో టెన్త్ పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ సర్కార్.. ఫలితాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎస్ సీ బోర్డు నిర్ణయించే ఆబ్జెక్టివ్ విధానంగా ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది.

అయితే ఆ ఫలితాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారికి మాత్రం పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. కరోనా తీవ్రత తగ్గాక అలాంటి వారికి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇంటర్, ఎస్ఎస్‌సీ బోర్డ్ అధికారులు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. గతేడాదిలాగే ఈసారి కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. స్కూల్స్, కాలేజీల్లో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని విద్యా సంస్థలను మూసివేశారు.

అలాగే ఇంటర్‌ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే సెకండియర్‌కు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. దీంతో వాళ్లంతా నేరుగా సెకండియర్‌కు వెళ్తారు. అయితే సెకండియర్ పరీక్షలను మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

కరోనా ఉధృతి తగ్గిన తర్వాత సెకండియర్ పరీక్షలను నిర్వహించనుంది. 15 రోజుల్లో ఇంటర్‌ సెకండియర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఫస్టియర్‌లో బ్యాక్‌లాగ్స్‌ ఉన్న సెకండియర్‌ వాళ్లకు మినిమమ్ మార్కులతో పాస్‌ చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు