తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లో తక్కువ ధరల్లో అపార్ట్‌మెంట్‌ ప్లాట్లు, స్థలాలు విక్రయానికి ఏర్పాట్లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ పరిధిలోని అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు, టవర్స్, ఖాళీ స్థలాల విక్రయానికి రంగం సిద్ధమవుతోంది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లో తక్కువ ధరల్లో అపార్ట్‌మెంట్‌ ప్లాట్లు, స్థలాలు విక్రయానికి ఏర్పాట్లు..

Rajiv Swagruha Flats

Updated On : June 8, 2025 / 7:29 AM IST

Rajiv Swagruga Flats For Sales In Telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ పరిధిలోని అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు, టవర్స్, ఖాళీ స్థలాల విక్రయానికి రంగం సిద్ధమవుతోంది. అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులను సమీకరించే క్రమంలో ప్రభుత్వం కీలకమైన అడుగు వేసింది. వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం మేరకు రాష్ట్రంలోని రాజీవ్ స్వగృహ – హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న అపార్ట్మెంట్ ప్లాట్లు, స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించి ఈనెల 20వ తేదీ నాటికి అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది.

Also Read: హరీశ్‌ రావు, ఈటల అబద్ధాలు చెప్పారు… నిజాలు ఇవే…: మంత్రి తుమ్మల

రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయి, పాక్షికంగా పూర్తయిన అపార్ట్‌మెంట్ల ప్లాంట్లతోపాటు, ఓపెన్ ప్లాట్లు అదేవిధంగా హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో నాలు ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లు, ఖాళీ స్థలాలు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. రాజీవ్ స్వగృహకు సంబంధించినంత వరకు గాజుల రామారం, పోచారం, ఖమ్మం పోలేపల్లి ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న టవర్లలో, ఒక్కో దానిలో సుమారు 100 నుంచి 150 వరకు ప్లాట్లు ఉన్న టవర్ యూనిట్ ఏక మొత్తంగా విక్రయించనున్నారు.

 

ఎటువంటి వివాదాలు లేని భూములు, అందుబాటులో ఉండే సరసమైన ధరలతో నిర్మించిన అపార్ట్‌మెంట్ల ప్లాట్లు కొనుగోలు చేసుకునేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని గృహనిర్మాణ శాఖ అధికారులు సూచించారు. అయితే, ఈ విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఓఆర్ఆర్ పరిసరాలు, ఇతర జిల్లాల్లోనూ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా హౌసింగ్ పథకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.