Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. బీసీ మహిళలకు భారీ శుభవార్త.. 100 శాతం ఉచితంగా..
Telangana Govt : రాష్ట్రంలో నిరుపేద, నిరుద్యోగ బీసీ మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక అభివృద్ధికోసం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
ewing machines Free distribution to BC womens
Telangana Govt : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. అంతేకాక.. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారు ఆర్థికాభివృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో నిరుపేద, నిరుద్యోగ బీసీ మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక అభివృద్ధి కోసం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున 100శాతం ప్రభుత్వ సబ్సిడీతో 1.19 లక్షల ఆటోమేటెడ్ కుట్టుమిషన్లను పంపిణీ చేయనున్నారు. సాధారణ కుట్టు మిషన్లతో పోలిస్తే ఆధునిక ఆటోమేటిక్ మిషన్లు వేగంగా పనిచేయడంతో పాటు మహిళల శ్రమను తగ్గించేలా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వం తాజా నిర్ణయంతో.. లక్షల మంది మహిళలు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందే అవకాశం లభించనుంది. అయితే, ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా ఉంటుంది..? ఎవరు అర్హులు? దరఖాస్తులు ఎలా చేసుకోవాలనే అంశాలపై త్వరలో అధికారులు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.
