Telangana Job Mela : నిరుద్యోగులకు శుభవార్త.. 20 వేల ఉద్యోగాలు.. మే 1 నుంచి నియామకాలు
Telangana Job Mela : నిరుద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. 20 వేల ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది.
telangana govt conduct job mela from may 1 to 12 in few districts
Telangana Job Mela :
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త… 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రెడీ చేసింది. ఇందుకు గాను జిల్లా కేంద్రాల్లో జాబ్ మేళాలు నిర్వహించబోతుంది. సుమారు 250కి పైగా కంపెనీలు ఈ ఉద్యోగ శిబిరాల్లో పాల్గొననున్నాయి. వీటిల్లో కస్టమర్ సర్వీస్, ఐటీ, బ్యాంకింగ్, డిజిటల్ మీడియా, ఫైనాన్స్, హెల్త్ కేర్, లాజిస్టిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. మే 1 నుంచి జిల్లా కేంద్రాల్లో ఈ జాబ్ మేళాలను నిర్వహించనున్నారు.
- మే 1న మహబూబ్నగర్,
- 2న నల్గొండ,
- 4న ఖమ్మం,
- 5న కరీంనగర్,
- 6న ఆదిలాబాద్, పెద్దపల్లి,
- 7న నిజామాబాద్,
- 8న సంగారెడ్డి, వరంగల్,
- 11న రంగారెడ్డి,
- 12న హైదరాబాద్ జిల్లా కేంద్రాల్లో జాబ్ మేళాలు ఉంటాయి.
అర్హత:
ఇంటర్, డిగ్రీ, డిప్లోమా, పీజీ చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాల్లో పాల్గొనవచ్చు. అభ్యర్థులు https://satg.telangana.gov.in/prajapalana వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్ మేళాలు నిర్వహించే కేంద్రాల్లో.. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. జాబ్ మేళాలో పాల్గొనేందుకు వచ్చే అభ్యర్థులకు రవాణా, ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించింది.. వేదిక వద్ద 10-15 వరకు రిజిస్ట్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని తెలిపింది. సమాచారం అందించేందుకు సహాయ కేంద్రాలతో పాటు వైఫై వంటి సదుపాయాలు కల్పించాలి అని పేర్కొంది.
నైపుణ్య శిక్షణ:
ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీల ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు.. నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు గాను ప్రభుత్వం.. ఐటీ, పరిశ్రమల శాఖ ద్వారా ఏర్పాట్లు చేస్తోంది. నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
