Indiramma Illu: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు కొత్త గైడ్‌లైన్స్ వచ్చేశాయ్.. ఈ నిబంధనలు పాటించకుంటే బిల్లులకు బ్రేక్..!

ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ పథకం కింద ఇంటి నిర్మాణం ప్రక్రియ జరగాలని, ఎలాంటి పొరపాట్లు జరిగినా

Indiramma Illu: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు కొత్త గైడ్‌లైన్స్ వచ్చేశాయ్.. ఈ నిబంధనలు పాటించకుంటే బిల్లులకు బ్రేక్..!

Indiramma Housing Scheme,

Updated On : March 28, 2025 / 12:52 PM IST

Indiramma Illu: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో అర్హత కలిగిన వారినుంచి ప్రజాపాలన, గ్రామసభల ద్వారా అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాల వారిగా అర్హుల జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం.. తొలి విడతగా ఇంటి స్థలం ఉన్నవారికి ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో భాగంగా తొలి విడత నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి.

Read Also : తెలంగాణలో తాటి, ఈత కల్లుతో వైన్ తయారీ పరిశ్రమ.. సీఎం రేవంత్ రెడ్డితో జర్మన్ ప్రతినిధి భేటీ

పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారు. అయితే, ప్రభుత్వం లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఆర్థిక సాయం చేయనుంది. ఇంటి నిర్మాణానికి ప్రారంభంలో (పౌండేషన్) రూ.లక్ష, బేస్ మెంట్, ఫిల్లర్స్ లెవల్ లో రూ.1.25లక్షలు, స్లాబ్ లెవల్ లో రూ.1.75లక్షలు, ఇతర నిర్మాణాలు పూర్తవుతుంటే రూ. లక్ష ఇస్తామని, లబ్ధిదారుల ఖాతాలోనే నేరుగా నిధులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే, తాజాగా.. ఇందిరమ్మ పథకంకు సంబంధించి ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు కొత్త గైడ్ లైన్స్ పంపించింది.

Read Also : Congress: సీఎం ఇలాఖాలో బీసీ నేతల అలక.. ఎందుకు? డిమాండ్ ఏంటి?

ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ప్రక్రియ జరగాలని, ఎలాంటి పొరపాట్లు జరిగినా బిల్లుల చెల్లింపు నిలిచిపోతుందని ప్రభుత్వం పేర్కొంది. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులందరికీ కలెక్టర్లు ఈ మేరకు సరైన ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. గైడ్ లైన్స్ తప్పనిసరిగా పాటించే లాగా చూడాలని, గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

 

 నూతన గైడ్‌లైన్స్ ఇలా..
♦ ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్ మట్టం పనులు ప్రారంభించే ముందు స్థలం ఫొటో తీయాలి.
♦ ఆ ఫొటోను ఇందిరమ్మ యాప్ లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలి.
♦ ఇంటి నిర్మాణ వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలి.
♦ రెండు గదులు, ఒక వంటగది, బాత్ రూమ్ ఉండేలా ఇంటి నిర్మాణం ఉండాలి.
♦ ప్రతి దశలోనూ ఫొటోలు తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్ లో అప్లోడ్ చేయాలి.
♦ వాటి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు ఉంటాయి.
♦ పాత ఇంటిని ఆనుకొనిగాని, ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు గదులుగా గాని, కొంతవరకు కూల్చి వేసిన వాటికిగాని ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిర్మాణం చేయకూడదు.
♦ గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇండ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ పథకం మంజూరు చేయొద్దు.
♦ ఇండ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతి లేదు.
♦ ఒకటే ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులకు ఒక ఇల్లు మాత్రమే ఇవ్వాలి.