Telangana Govt: పేదలకు సన్నబియ్యం పథకం నేడే ప్రారంభం.. మీకు ఎప్పుడు ఇస్తారు..? ఫ్యామిలీకి ఎన్ని కేజీలు ఇస్తారు.?
రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది.

Telangana Govt
Telangana Govt: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది. ఉగాది పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆహార భద్రతా కార్డులు కలిగిన వారికి ఇప్పటి వరకు ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు.
Also Read: Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అప్‌డేట్.. వారికి తక్షణే రూ. లక్ష చెల్లింపు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేలకోట్ల రూపాయల సబ్సిడీ భరిస్తూ పీడీఎస్ ద్వారా ఆహార భద్రత కార్డులు కలిగిన వారికి ప్రతీనెలా దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. అయితే, ఈ బియ్యంలో 85శాతానికిపైగా దుర్వినియోగం అవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఇవాళ ప్రారంభించనుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెల కోటాను ఒకటో తేదీన పంపిణీ చేయనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 89.73లక్షల ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. వాటిలో 2.85కోట్ల లబ్ధిదారులు నమోదై ఉన్నారు. ఇక నుంచి వీరందరికీ నెలకు 6కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.