SBI-Telangana Govt : SBIకి భారీ ఝలక్.. అకౌంట్లన్నీ వేరే బ్యాంక్‌కు మార్చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం?.. కారణం ఇదే..
SBI-Telangana Govt : SBI బ్యాంకు రాయదుర్గం భూములపై కోర్టులో పిటిషన్ వేయడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. భూముల వివాదం వెనుక అసలు కారణాలపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు సమాచారం..
SBI-Telangana Govt
SBI-Telangana Govt : ఎస్బీఐకి తెలంగాణ ప్రభుత్వం భారీ ఝలక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని ఖాతాలను మరో బ్యాంకుకు మార్చాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీని వెనుక అసలు కారణాలు లేకపోలేదు..
ఇటీవలే రాయదుర్గం భూములపై ఎస్బీఐ బ్యాంకు కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై తెలంగాణ సర్కార్ ఒక్కసారిగా (SBI-Telangana Govt) సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్టు సమాచారం.
గతంలో సుమారు రూ.600 కోట్ల మార్కెట్ వాల్యూ ఉన్న భూమిని కేవలం రూ.13.5 కోట్లకు కేటాయించారు. ఈ భూమికి ప్రత్యామ్నాయంగా 2.6 ఎకరాల భూమిని ఇస్తామంటే గతంలో ఎస్బీఐ అధికారులు అంగీకరించారు. ఎస్బీఐ రాష్ట్రస్థాయి అధికారులతో ప్రభుత్వ చర్చల్లో కూడా మౌఖికంగా ఎస్బీఐ అంగీకరించింది.
Read Also : IUML Kader Mohideen : విజయ్ మాస్టర్ ప్లాన్.. డీఎంకేకి గుడ్ బై కొట్టిన IUML..
కానీ, ఆ తర్వాత మాట మార్చిన ఎస్బీఐ బ్యాంక్ కోర్టులో పిటిషన్ వేసింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ పరిణామాన్ని తెలంగాణ ప్రభుత్వం కేవలం భూముల వివాదంగా కాకుండా దీని వెనుక ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు, ఇతర ప్రయోజనాల కుట్ర కోణం ఏదైనా ఉందా అనే అంశంపై కూడా సర్కార్ ఆరా తీస్తోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఖాతాలు, వివిధ శాఖల డిపాజిట్లు, ప్రభుత్వ సంస్థల బ్యాంకింగ్ లావాదేవీలపై ఉన్నతాధికారులు సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి వేల కోట్ల లావాదేవీలు ఎస్బీఐలో ఉండగా, భవిష్యత్తులో ఆయా ఖాతాలను ఇతర బ్యాంకులకు మళ్లించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
