High Court green signal Singareni Elections
High Court – Singareni Elections : సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను రిజెక్ట్ చేసింది. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. డిసెంబర్ 27న యధావిధిగా సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం కోరింది.
కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన కారణంగా ఎన్నికలను డిసెంబర్ 27కు బదులు వచ్చే ఏడాది మార్చ్ లో నిర్వహించాలని ప్రభుత్వం కోరింది. ఇప్పటికే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పలు మార్లు వాయిదా కోరారు. ఇక మళ్లీ ఎన్నికలను వాయిదా వేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.
Kadiyam Srihari : ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య : కడియం శ్రీహరి
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో అండర్ టేకింగ్ ఇచ్చారు కదా అని హైకోర్టు తెలిపింది. సింగరేణి ఎన్నికలు డిసెంబర్ 27నే నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఐఏ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది.