RS Praveen Kumar : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశం

ప్రవీణ్ కుమార్ కొంతమంది వ్యక్తులపై దాడి చేసి, డబ్బులు తీసుకున్నారని సిర్పూర్ కాగజ్ నగర్ లో ఆయనపై కేసు నమోదైంది.

RS Praveen Kumar : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశం

RS Praveen Kumar (1)

Updated On : November 16, 2023 / 3:49 PM IST

High Court Relief RS Praveen Kumar : తెలంగాణ బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేయొద్దంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రవీణ్ కుమార్ కొంతమంది వ్యక్తులపై దాడి చేసి, డబ్బులు తీసుకున్నారని సిర్పూర్ కాగజ్ నగర్ లో ఆయనపై కేసు నమోదైంది.

దీనిపై ప్రవీణ్ కుమార్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది.

KTR : 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలి : కేటీఆర్

దీంతో పోలీసులు ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేయడానికి వెనుకంజ వేశారు. సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. తనతోపాటు తన కొడుకుపై హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసులు నమోదు చేశారని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిని తాను పూర్తిగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా, జనం గొంతుకగా తాను ఉండటం వల్లనే తనపై ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.