KTR : 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలి : కేటీఆర్

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు. పని చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రోత్రహించాలన్నారు.

KTR : 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలి : కేటీఆర్

KTR road show

KTR Road Show Chevella : 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. చేవెళ్లలో గులాబీ జెండా ఎగరాలన్నారు. 111 జీవోను ఎత్తేస్తామన్న హామీని నెరవేర్చామని తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు. పని చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రోత్రహించాలన్నారు.

చేవెళ్లలో కాలే యాదయ్యను గెలిపించాలని కోరారు. ఆసరా పెన్షన్లను దశల వారీగా రూ.5 వేలకు పెంచుతామని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆయుధాల కేసులో పట్టుబడ్డ వ్యక్తి అని ఆరోపించారు. ప్రజలు ఆశీర్వదిస్తే రెండు సార్లు అధికారంలోకి వచ్చి కేసీఆర్ నాయకత్వంలో చేస్తున్న పనులు జనం కళ్లముందు ఉన్నాయని తెలిపారు.

RS Praveen Kumar : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశం

భారతదేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు.