September 16th నుంచి Engineering పరీక్షలు

బీటెక్, ఎంటెక్, డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఫైనల్ సెమిస్టర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ఇంజనీరింగ్ పరీక్షలు జరుగనున్నాయి. జేఎన్టీయూ చర్యలు చేపట్టింది.
ఫైనల్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. 2020, ఆగస్టు 28వ తేదీ శుక్రవారం వివిధ యూనివర్సిటీ రిజస్ట్రార్ లతో మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
https://10tv.in/accenture-to-lay-off-5-global-workforce-10000-in-india-at-risk-of-losing-jobs/
ఎగ్జామ్స్ నిర్వహించకుండా…డిగ్రీల ప్రధానం సరికాదని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) వెల్లడించడంపై సుప్రీంకోర్టు ఏకీభవించింది. పరీక్షలు నిర్వహంచాలని చెప్పడంతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వర్సిటీ అభిప్రాయాలు సేకరించారు.
సెప్టెంబరు 30లోగా పరీక్షల నిర్వహణకు తాము అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు వర్సిటీలు వెల్లడించాయి. దీంతో పరీక్షల షెడ్యూల్స్‌ను ఒకట్రెండు రోజుల్లో జారీ చేయాలని ఆయా వర్సిటీల రిజిస్ట్రార్‌లకు మండలి ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థులు త్వరలోనే పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
ఆయా పరీక్షల కోసం ఎదురు చూస్తున్న దాదాపు 3.5 లక్షల మంది బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, సంప్రదాయ డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థుల ఉత్కంఠకు తెరపడింది.
- సెప్టెంబరు 16వ తేదీ నుంచి బీటెక్ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ప్రారంభించాలని నిర్ణయించింది.
- బీఫార్మసీ పరీక్షల తేదీలను కూడా ఖరారు చేయనుంది.
- వచ్చే నెలలో ఎంటెక్ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించాలని JNTU భావిస్తోంది.
- పీజీ పరీక్షలను వీలైతే సెప్టెంబర్, లేదంటే అక్టోబరులో నిర్వహించే అవకాశం ఉంది.
- ఇక పరీక్షలకు రెడీ అయ్యేందుకు..10 నుంచి 15 రోజుల సమయం ఇవ్వనున్నారు.