Lucky Draw: లక్కీ డ్రా ద్వారా సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్ల కేటాయింపు.. అర్హులు వీరే.. ఇలా అప్లయ్ చేసుకోండి..

గచ్చిబౌలిలోని ఫ్లాట్ల ధర 26 లక్షల నుండి 36.20 లక్షల రూపాయల మధ్య ఉంది. వరంగల్‌లో రూ.19 లక్షల నుండి 21.50 లక్షల రూపాయల మధ్య, ఖమ్మంలో రూ.11.25 లక్షలుగా ఉంది.

Lucky Draw: లక్కీ డ్రా ద్వారా సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్ల కేటాయింపు.. అర్హులు వీరే.. ఇలా అప్లయ్ చేసుకోండి..

Updated On : December 24, 2025 / 5:39 PM IST

Lucky Draw: తెలంగాణ హౌసింగ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. గచ్చిబౌలి, వరంగల్, ఖమ్మంలలో 450 నుండి 650 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 339 సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లను తక్కువ ఆదాయ వర్గాల (LIG) వారికి లక్కీ డ్రా ద్వారా కేటాయించనున్నట్లు ప్రకటించింది. సంవత్సరానికి రూ.6 లక్షలకు మించని (నెలకు రూ.50వేలు ) ఆదాయం ఉన్న వారికి వీటిని కేటాయిస్తారు. ఆసక్తి ఉన్నవారు మీసేవ కేంద్రాల ద్వారా లేదా ఆన్‌లైన్‌లో (https://tghb.cgg.gov.in) దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 3.

గచ్చిబౌలిలోని ఫ్లాట్లు ఏఐజీ ఆసుపత్రికి సమీపంలో ఉన్నాయి. వరంగల్‌లోని ఫ్లాట్లు అక్కడి రైల్వే స్టేషన్‌కు సుమారు వెయ్యి మీటర్ల దూరంలో ఉన్నాయి. గచ్చిబౌలిలో 111 ప్లాట్లు, ఖమ్మంలోని శ్రీరామ్ హిల్స్‌లో 126, వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో 102 ప్లాట్లు ఉన్నాయి. గచ్చిబౌలిలోని ఫ్లాట్ల ధర 26 లక్షల నుండి 36.20 లక్షల రూపాయల మధ్య ఉంది. వరంగల్‌లో రూ.19 లక్షల నుండి 21.50 లక్షల రూపాయల మధ్య, ఖమ్మంలో రూ.11.25 లక్షలుగా ఉంది.

గచ్చిబౌలిలో 76 ఫ్లాట్లు 2018లో, 35 ఫ్లాట్లు 2023లో నిర్మించారు. అలాగే, ఖమ్మం వరంగల్‌లోని ఫ్లాట్లు 2023లో నిర్మించారు. వీటిని ప్రైవేట్ కంపెనీలతో భాగస్వామ్యంతో నిర్మించారు. ఈ ఫ్లాట్ల ధరలు వాణిజ్య మార్కెట్ ధరల కంటే తక్కువగా ఉన్నాయని బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ తెలిపారు.

గచ్చిబౌలిలోని ఫ్లాట్ల కోసం లక్కీ డ్రా జనవరి 6న నిర్వహిస్తారు. వరంగల్‌లోని ఫ్లాట్ల కోసం జనవరి 8న, ఖమ్మంలోని ఫ్లాట్ల కోసం జనవరి 10న లక్కీ డ్రా నిర్వహిస్తారు. బోర్డు ఇంతకు ముందు భూ పార్శిళ్లను వేలం వేసింది. రాజీవ్ స్వగృహకు చెందిన 1, 2, 3 బీహెచ్‌కే ఫ్లాట్లను కూడా గతంలో లక్కీ డ్రా ద్వారానే కేటాయించారు.

Also Read: తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్.. ప్రభుత్వ పథకాలు కట్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..