Minister Harish Rao Talks On During The Opening
Mallanna Sagar Project : సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తరువాత ఆయన మల్లన్న సాగర్ ను జాతికి అంకితం చేశారు. అనంతరం కేసీఆర్ పలు అంశాలపై ప్రగించిన అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే కొమరవెల్లి మల్లన్నకు ఐదు కళశలతో పాదాలు కడుగుతానని కోరిక ఈ శుభదినాన నెరవేరింది అని సంతోషం వ్యక్తంచేశారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆటంకాలు కల్పించారని..కానీ వాటిన్నింటిని అధిగమించామన్నారు. సుప్రీం కోర్టు, హై కోర్టు,గ్రీన్ ట్రిబ్యూనల్ లో ఎన్ని కేసులు వేసి ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డుకట్ట వేసినా మల్లన్న దయవల్ల ఈ నిర్మాణం పూర్తయింది అని ఆనందం వ్యక్తంచేశారు.సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న ఈ ప్రాంతనికి మల్లన్న సాగర్ తో నీటి కష్టాలు పోయి ఎడారిలో ఓయసిస్సులా మారిందన్నారు.
Also read : CM KCR : మల్లన్న సాగర్ జాతికి అంకితం.. తెలంగాణకు కరువు రాదన్న సీఎం కేసీఆర్
ఉమ్మడి ఏపీలో తెలంగాణలో నీటి కష్టాలే కాదు నీటి కరవు కూడా ఉండేదని..మనం తెలంగాణ సాధించుకున్నాక ఎన్నో ఆటంకాలు సృష్టించినా సీఎం కేసీఆర్ ఏమాత్రం వెరువకుండా మల్లన్న సాగర్ నిర్మించి నీటి కష్టాలు తీర్చారని అన్నారు. సాగు,తాగు నీరు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించి నీళ్లను పారిస్తే, బీజేపీ నాయకులు మాత్రం మతాల పేరుతో చిచ్చు పెట్టి రక్తాన్ని పారిస్తున్నారని ఇటువంటి ఆగడాలని తిప్పి కొట్టాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జేసీబీ, ప్రోక్లైన్లతో మనం నీటి ప్రాజెక్టుల్ని నిర్మించుకుని నీటి కష్టాల్ని అధిగమిస్తుంటే బీజేపీ మాత్రం ఓట్లు వేయకపోతే జేసీబీ, ప్రోక్లైన్లతో దాడిచేస్తామని ప్రజల్ని భయపెడుతున్నారని విమర్శించారు.
యూపీలో యోగీ ఆదిత్యానాథ్ కు ఓట్లు వేయకపోతే వారిని గుర్తించి వారి ఇళ్లమీదకు జేసీబీలను పంపిస్తామని..వాటితో వారి ఇళ్లను కూల్చివేస్తామంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే యూపీ ఓటర్లను బెదిరించిన ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించి..జేసీబీ, ప్రోక్లైన్లతో మనం నీటి ప్రాజెక్టుల్ని నిర్మించుకుని నీటి కష్టాల్ని అధిగమిస్తుంటే బీజేపీ మాత్రం ఓట్లు వేయకపోతే జేసీబీ, ప్రోక్లైన్లతో దాడిచేస్తామని ప్రజల్ని భయపెడుతున్నారంటూ విమర్శించారు.
మల్లన్న సాగర్ తక్కువ కాలంలోనే పూర్తి చేసుకోవటానికి కారణం సీఎం కేసీఆరే నని..మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం వెనుక సీఎం కేసీఆర్ కృషి ఉందని అన్నారు. మల్లన్న్ ప్రాజెక్టు ప్రారంభించుకున్న ఈరోజు ఒక శుభదినం. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు మన తెలంగాణకే తలమానికం అని అన్నారు. బుధవారం (ఫిబ్రవరి 23,2022)మల్లన్న దేవుడు పుట్టిన రోజు. ఇవాళ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమని..అన్నారు.
Also read : CM KCR : దేశం దారి తప్పుతోంది.. సెట్ రైట్ చేస్తా – సీఎం కేసీఆర్
మల్లన్న ప్రాజెక్టు పూర్తి అవ్వదని..నీళ్లు రానేరావు అని అన్నప్రతిపక్షాలు కుట్రల్ని భగ్నం చేసి ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామన్నారు. ఈ ప్రాజెక్టును ఆపాలని సుప్రీం, హైకోర్టుతో పాటు గ్రీన్ ట్రిబ్యునల్‌లో 350 కేసులు వేశారు. సుప్రీంకోర్టు నాలుగేళ్ల క్రితం అన్ని కేసులను కొట్టేస్తూ తీర్పునిచ్చిందని గుర్తు చేసుకున్నారు.
మల్లన్న సాగర్ జలాశయం ద్వారా సగం తెలంగాణకు నీళ్లు వస్తాయి. కరువు ఇక ఉండనే ఉండదుని..ఈ ప్రాంతం ఒక్కప్పుడు కరువు కాటకాలకు నిలయంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసారు. అంబలి కేంద్రాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకొచ్చి సస్యశ్యామలం చేశారు కేసీఆర్ కృషీవలుడని కీర్తించారు. ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడిగా.. 100 ఏళ్ల భవిష్యత్ ఆలోచించి ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్‌ను కేసీఆర్ నిర్మించారన్నారు. భారత దేశంలోనే నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం మల్లన్న సాగర్ అని..నదికి కొత్త నడక నేర్పారని..గతంలో ఈ ప్రాంతం వానాకాలం కూడా ఎండకాలం లాగే ఉండేది. ఇప్పుడు ఏ కాలమైనా వానాకాలం లాగే ఉంది. మండుటెండల్లో కూడా చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయన్నారు. చెక్ డ్యామ్‌లు నీటితో కళకళలాడుతున్నాయి. సుజల దృశ్యం చూస్తుంటే…. జన్మ ధన్యం అయినట్లు అనిపిస్తుంది అని హరీశ్‌రావు ఎంతో సంతోషం వ్యక్తంచేశారు.