తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి.. న్యాయవాది నుంచి డీజీపీ వరకు ఆయన ప్రస్థానం ఇలా..
ఐరాస శాంతిపరిరక్షక దళంలో భాగంగా యూఎన్ మిషన్ ఇన్ కొసావోలోనూ ఆయన పనిచేశారు.

Shivadhar Reddy: తెలంగాణ కొత్త డీజీపీగా 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి శివధర్ రెడ్డి నియమితుడయ్యారు. ఆయన ఇంటెలిజెన్స్ ఛీఫ్‌గా ఉన్నారు.
ఇవాళ డీజీపీగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శశిధర్ రెడ్డి అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందుకున్నారు. శివధర్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లాలోని తూలేకలాన్ గ్రామం. ఆయన చదువు అంతా హైదరాబాద్‌లోనే సాగింది. ఓయూ నుంచి ఎల్‌ఎల్‌బీ చేశారు. (Shivadhar Reddy)
Balakrishna: బాలయ్య కామెంట్స్‌పై కూటమిలో గుసగుసలు.. వైసీపీ క్యాడర్‌కు స్వీట్ న్యూస్
కొంతకాలం లాయర్‌గానూ ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత సివిల్స్ రాసి ఎంపికయ్యారు. 1994లో ఐపీఎస్‌లోకి ప్రవేశం పొంది, ఏఎస్పీగా విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. 2014-2016 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కొనసాగారు.
ఐరాస శాంతిపరిరక్షక దళంలో భాగంగా యూఎన్ మిషన్ ఇన్ కొసావోలోనూ ఆయన పనిచేశారు. 2016 సెప్టెంబరులో తెలంగాణ సర్కారు శశిధర్ రెడ్డిని అదనపు డీజీ (పర్సనల్)గా నియమించింది. 2022 డిసెంబరులో అదనపు డీజీ రైల్వేస్‌గా ఆయన నియమితుడయ్యారు. 2023లో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మళ్లీ నియమితుడయ్యారు. గత ఏడాది ఆగస్టులో డీజీగా పదోన్నతి పొందారు. ఆయన అనేక అవార్డులు అందుకున్నారు.