హిందూ సంప్రదాయాలు, ధార్మిక సిద్ధాంతాలు మాకంటే గొప్పుగా మీకు తెలుసా…బీజేపీ నేతలపై మంత్రి తలసాని ఫైర్

  • Publish Date - August 19, 2020 / 11:14 PM IST

టీఆర్ఎస్ ప్రభుత్వం హిందువుల పండుగలను నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ నేతలు చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో వినాయక చవితి పండుగను ఇళ్లళ్లో జరుపుకోవాలని చెప్పడంపై కమలనాథులు తప్పుబట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగలు చేసుకునే ఎవరైనా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.



ఆరేళ్లళ్లో తమ ప్రభుత్వం గొప్పగా పండుగలు చేయలేదా? మహంకాళి జాతరకు ప్రైవేట్ టెంపుల్స్ కు అఫిషియల్ గా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం దేశంలో ఎక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. వెయ్యి కోట్లు యాదాద్రి నరసింహ్మస్వామి టెంపుల్ నిర్మిస్తున్నామని..దేశంలో ఎక్కైడైనా గవర్నమెంట్ టెంపుల్ నిర్మించడం చూశారా అని ప్రశ్నించారు.



హిందూ సంప్రదాయాలు, ధార్మిక సిద్ధాంతాలు తమకంటే గొప్పుగా మీకు తెలుసా… అని బీజేపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రొవోగ్ చేయడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదన్నారు.