Telangana Congress : ‘ఐ డోంట్ కేర్ పీసీసీ కమిటీ ..ఏఐసీసీ షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడేశా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పీసీసీ కమిటీలను పట్టించుకోను ..ఏఐసీసీ షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడేశా అంటూ కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

MP komatireddy venkat reddy sensational comments On PCC Committee and AICC show cause notice
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల కాలంలో కోమటిరెడ్డి వ్యవహారం తలనొప్పిగా తయారైంది టీ కాంగ్రెస్ కు. పార్టీలో కొనసాగుతునే పార్టీకి వ్యతిరేకంగా కామెంట్లు చేయటం..పార్టీ నేతలపైనే నోరు పారేసుకోవటం పీసీసీని పట్టించుకోకపోవటమే కాదు కాదు ఏకంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా బేఖాతరు చేయటం వంటివి జరుగుతున్నాయి. ఈక్రమంలో తెలంగాణకాంగ్రెస్ కు కొత్త ఇన్ చార్జ్ గా నియమితులైన మాణిక్ రావు థాక్రే బుధవారం (జనవరి 11,2023) హైదరాబాద్ వచ్చి గాంధీభవన్ కు రండి మాట్లాడుకుందాం అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసిన ఆహ్వానించినా పట్టించుకోలేదు. గాంధీ భవన్ కు రాను బయట ఎక్కడైనా మీట్ అవుదాం అంటూ చెప్పారు.దీంతో మాణిక్ రావు థాక్రేతో వెంకట్ రెడ్డి ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని క్యాంపు ఆఫీసులో గురువారం (జనవరి 12) భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితుల గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేసే పనిలో ఉన్న కొత్తబాస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కూల్ చేయటానికి యత్నించినా ఆయన మాత్రం తనదైనశైలిలోనే ఉన్నారు.
ఈక్రమంలో మాణిక్ థాక్రేతో భేటీ ముగిసిన తరువాత కోమటిరెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ కమిటీలను ఏమాత్రం పట్టించుకోనని..ఏఐసీసీ షోకాజ్ నోటీలను ఎప్పుడో చెత్తబుట్టలోపారేశాను అంటూ వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందంటూ వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఈ షోకాజ్ నోటీసులను ఎప్పుడో చెత్తబుట్టలో పారేశాను అంటూ ఏఐసీసీ అంటే కూడా ఐడోంట్ కేర్ అన్నట్లుగా మాట్లాడారు. నాలుగుసార్లు ఓడిపోయినవారితో కలిసి నేను కూర్చోవాలా? అంటూ పరోక్షంగా కొంతమంది కాంగ్రెస్ నేతలను ఉద్ధేశించి ఎద్దేవా చేస్తు మాట్లాడారు. మా ఫోటోలను మార్ఫింగ్ చేస్తే ఏఐసీసీ కూడా పట్టించుకోలేదు. నేను స్వయంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అటువంటిది ఏఐసీసీ షోకాజ్ నోటీసులు నేను పట్టించుకోవాలా? అందుకే వాటిని చెత్తబుట్టలో పారేశాను అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు.
టీడీపీలోంచి కాంగ్రెస్ లో చేరిన కొద్దికాలానికే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అవ్వటం..ఆ పదవిని ఆశించిన కోమటిరెడ్డి సోదరులు అప్పటినుంచి కాంగ్రెస్ లో కొనసాగుతున్నా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరు రాజగోపాల్ రెడ్డి బీజేపీ గూటికి చేరారు.ఇక కోమటిరెడ్డి ఏపార్టీలోనూ చేరకపోయినా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేయటం ఇష్టంలేక పార్టీలో కొనసాగలేక బయటకు వెళ్లకుండానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది. పీసీసీ మీటింగ్ లకు కూడా హాజరుకావటంలేదు. పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా హాజరుకావటంలేదు. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరటాన్ని వెంకట్ రెడ్డి పరోక్షంగా ప్రోత్సహించినట్లుగానే ఉందనే సమాచారం. కోమటిరెడ్డి బ్రదర్స్ స్వప్రయోజనాల కోసం పదవుల కోసం మాత్రమే పార్టీలు కొనసాగుతారనే ఆరోపణలు ఉన్నాయి. మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ చేరి బీజేపీ తరపున పోటీ చేయగా తన తమ్ముడికి ఓట్లు వేయండీ అంటూ మద్దతు ఇవ్వండి అంటూ మునుగోడు కాంగ్రెస్ నేతలపై వెంకట్ రెడ్డి ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వచ్చాయి. మునుగోడు ప్రచారంలో పాల్గొనలేదు సరికదా..ఆ సమయంలో విదేశాలకు వెళ్లి అక్కడనుంచి తమ్ముడి గెలుపు (బీజేపీ)కోసం ఫోన్లలోనే క్యాంపెయిన్ చేసినట్లుగాను.. అదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి ఖాయం అంటూ చేసిన వ్యాఖ్యలకు ఏఐసీసీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులను కూడా నేను చెత్తబుట్టలో పారేశానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించటం వంటివి చూస్తుంటే ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.