Municipal Elections Results : నల్గొండ జిల్లాలో నందికొండ, హలియా, చండూరు మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం
Municipal Elections Results : తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. నల్గొండ జిల్లాలోని నందికొండ, హలియా మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
Municipal Elections Results
Municipal Elections Results : తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. అయితే, నల్గొండ జిల్లాలోని నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 12వార్డులకుగాను 11 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 8వ వార్డు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు.
హాలియా మున్సిపాలిటీలో..
హాలియా మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం పన్నెండు వార్డుల్లో పది వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా.. ఒక వార్డులో బీఆర్ఎస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
చండూరు మున్సిపాలిటీలో,,
నల్గొండ జిల్లాలోని చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆరు వార్డుల్లో విజయం సాధించగా.. బీఆర్ఎస్ అభ్యర్థులు మూడు వార్డుల్లో, సీపీఐ అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించారు.
Also Read : Municipal Elections Results : ఫస్ట్ మున్సిపాలిటీ గెలిచిన బీఆర్ఎస్.. 14 వార్డుల్లో విజయం
