తెలంగాణలో బీటెక్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షురూ.. ఏయే బ్రాంచీల్లో ఎన్ని సీట్లో తెలుసా?
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని రెండు ప్రభుత్వ కాలేజీల్లో 630, జేఎన్టీయూహెచ్ పరిధిలోని తొమ్మిది ప్రభుత్వ కళాశాలల్లో 3,210 సీట్లు, కాకతీయ వర్సిటీ పరిధిలోని రెండు ప్రభుత్వ కాలేజీల్లో 780 సీట్లు ఉన్నాయి.

తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ ప్రథమ సంవత్సర ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కళాశాలల్లోని సీట్ల వివరాలను అధికారులు ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 171 కాలేజీల్లో 1,07,218 బీటెక్ సీట్లు ఉన్నాయి.
కన్వీనర్ కోటాలో 76,795 సీట్లు ఉండగా, 21 ప్రభుత్వ కాలేజీల్లో 5,808 సీట్లు ఉన్నాయి. 148 ప్రైవేటు కళాశాలల్లో 99,610 సీట్లు ఉంటే, 69,727 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. రెండు ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 1,800 సీట్లు ఉంటే, కన్వీనర్ కోటాలో 1,260 సీట్లను భర్తీ చేస్తున్నారు.
Also Read: “విచారణకు రండి”.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు నోటీసులు జారీ..
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని రెండు ప్రభుత్వ కాలేజీల్లో 630, జేఎన్టీయూహెచ్ పరిధిలోని తొమ్మిది ప్రభుత్వ కళాశాలల్లో 3,210 సీట్లు, కాకతీయ వర్సిటీ పరిధిలోని రెండు ప్రభుత్వ కాలేజీల్లో 780 సీట్లు ఉన్నాయి. మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలోని ఓ ప్రభుత్వ కాలేజీలో 240 సీట్లు, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ పరిధిలోని ఒక సర్కార్ కళాశాలో 160 సీట్లు ఉన్నాయి. అలాగే, అగ్రికల్చర్ వర్సిటీ పరిధిలోని ఒక ప్రభుత్వ కళాశాలలో 45 సీట్లు, వెటర్నరీ వర్సిటీ పరిధిలోని ఒక గవర్నమెంట్ కాలేజీలో 23 సీట్లు ఉన్నాయి.
బ్రాంచి | సీట్లు |
---|---|
సీఎస్‌ఈ | 26,150 |
సీఎస్‌ఈ(ఏఐ-ఎంఎల్) | 12,495 |
సీఎస్‌ఈ (డేటా సైన్స్) | 6,996 |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | 3,681 |
సీఎస్‌ఈ (సైబర్ టెక్నాలజీ) | 1,439 |
ఏఐ అండ్ ఎంఎల్ | 1,235 |
ఈసీఈ | 10,125 |
ఈఈఈ | 4,301 |
సివిల్ | 3,129 |
మెకానికల్ | 2,994 |
కేటగిరీలు | సంఖ్య | సీట్లు (ఈబీజీ ప్లస్ కోటా కాకుండా) |
---|---|---|
ప్రభుత్వం | 21 | 5,808 |
ప్రైవేట్ | 148 | 99,610 |
ప్రైవేట్ వర్సిటీలు | 2 | 1,800 |
మొత్తం | 171 | 1,07,218 |