“విచారణకు రండి”.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు నోటీసులు జారీ..

దాన్ని నమ్మి తాము మోసపోయినట్లు ఓ వైద్యురాలు, మరో వ్యక్తి కేసు వేశారు.

“విచారణకు రండి”.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు నోటీసులు జారీ..

Mahesh Babu

Updated On : July 7, 2025 / 8:00 AM IST

సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు మహేశ్‌బాబు ప్రచారకర్తగా ఉన్నారు. మహేశ్‌బాబు ఫొటోతో ఆ సంస్థ బ్రోచర్‌లు ఇస్తూ వెంచర్‌ ప్రత్యేకతలను వివరించింది. దాన్ని నమ్మి తాము మోసపోయినట్లు ఓ వైద్యురాలు, మరో వ్యక్తి కేసు వేశారు.

బాలాపూర్‌లో ఒక్కో ప్లాట్‌ కొనడానికి రూ.34,80,000 చొప్పున ఇచ్చారు. అన్ని అనుమతులు ఉన్నాయని ఆ రియల్‌ ఎస్టేట్ సంస్థ యజమాని నమ్మించారని చెప్పారు. ఆ తర్వాత అసలు ఆ లేఅవుటే లేదని తెలుసుకున్నామని చెప్పారు. తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వాలని కోరితే ఆ రియల్‌ ఎస్టేట్ సంస్థ యజమాని కేవలం రూ.15 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చారని, అది కూడా వాయిదాల్లో ఇచ్చారని తెలిపారు.

Also Read: చెంచులకు 13,000 ఇందిరమ్మ ఇళ్లు.. మంజూరు పత్రాల పంపిణీ: మంత్రి పొంగులేటి

ఆ తర్వాత మిగతా డబ్బు ఇవ్వలేదు. దీంతో తమకు రావాల్సిన మిగతా డబ్బు అతడి నుంచి వచ్చేలా చేయాలని కోరారు. ఈ కేసులో ఇవాళ విచారణకు హాజరుకావాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ నోటీసుల్లో పేర్కొంది. మెస్సర్స్‌ సాయి సూర్య డెవలపర్స్‌ కంపెనీ మొదటి, దాని యజమాని కంచర్ల సతీశ్‌ చంద్రగుప్తాను రెండో, ప్రచారకర్త మహేశ్‌బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ ఈ ఫిర్యాదు దాఖలైంది.