చెంచులకు 13,000 ఇందిరమ్మ ఇళ్లు.. మంజూరు పత్రాల పంపిణీ: మంత్రి పొంగులేటి

ఏయే ప్రాంతాల్లో ఎన్నెన్ని ఇళ్లు?

చెంచులకు 13,000 ఇందిరమ్మ ఇళ్లు.. మంజూరు పత్రాల పంపిణీ: మంత్రి పొంగులేటి

Indiramma House Scheme

Updated On : July 7, 2025 / 7:38 AM IST

చెంచులకు రాష్ట్రంలో 21 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వారి సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా 13,266 కుటుంబాలకు ఇళ్లు ఇస్తున్నామని వివరించారు. చెంచులు బాగా వెనకబడిపోయారని, ఎన్నో ఏళ్లుగా సొంత ఇళ్లు లేకుండానే జీవిస్తున్నారని చెప్పారు.

ఉట్నూరు, భద్రాచలంతో పాటు మున్ననూర్, ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలోని చెంచులకు ఇళ్లు మంజూరు చేసినట్లు వివరించారు. తొలి దశలో ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా మున్ననూర్‌లో ఇళ్ల మంజూరు పత్రాలు ఇస్తున్నట్లు చెప్పారు. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో 10,836 ఇళ్లు ఇస్తున్నామన్నారు.

మున్ననూర్ చెంచు స్పెషల్ ప్రాజెక్టులో భాగంగా 2,156 ఇళ్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 2025లో తెలంగాణలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500-700 ఇళ్లు చొప్పున మంజూరు చేశామన్నారు.

Also Read: శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ముప్పు లేదు.. కొన్ని గేట్లు మాత్రం రస్టు పట్టి ఉన్నాయి: డ్యామ్‌ల ఎక్స్‌పర్ట్ కన్నయ్య 

ఏ ప్రాంతాల్లో ఎన్నెన్ని ఇళ్లు?

  • మంచిర్యాలలో 157
  • నిర్మల్‌లో 153
  • ఆసిఫాబాద్ 3,371,
  • బోథ్ 163,
  • ఖానాపూర్లో 2,257,
  • సిర్పూర్లో 227,
  • ఆదిలాబాద్లో 2,848,
  • బెల్లంపల్లి 223
  • అశ్వరావుపేటలో 274
  • అచ్చంపేటలో 785
  • మహబూబ్‌ నగర్‌లో 245
  • పరిగిలో 63
  • తాండూర్ లో174
  • కొల్లాపూర్‌లో 105
  • కల్వకుర్తిలో 120
  • వికారాబాద్‌లో 63
  • దేవరకద్రలో 64,
  • నాగార్జునసాగర్‌లో 17