శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ముప్పు లేదు.. కొన్ని గేట్లు మాత్రం రస్టు పట్టి ఉన్నాయి: డ్యామ్‌ల ఎక్స్‌పర్ట్ కన్నయ్య
"గేట్లు పెట్టి 40 సంవత్సరాలు పూర్తి అయింది" అని అన్నారు.

శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ముప్పు లేదని డ్యామ్‌ల ఎక్స్‌పర్ట్, ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు అన్నారు. ఇవాళ ఆయన శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు.
ఈ సందర్భంగా కన్నయ్య నాయుడు మాట్లాడుతూ… “70 సంవత్సరాల తర్వాత గేట్లను రీప్లేస్ చేయాలి. 2009లో ఎఫ్ఆర్ఎల్ మీద 9 అడుగుల వరద వచ్చింది. ఫ్లడ్ వచ్చినప్పుడు ఒక్కక్క గేటు నుంచి 1.13 లక్షల క్యూసెక్కుల వరద డిచార్జ్ అయ్యింది. 2009లో ప్లంజ్ ఫ్లూ స్టార్ట్ అయింది. 2010 నుంచి ఇప్పటి వరకు గేట్లకు పెయింటింగ్ వేయలేదు.
గేట్లకు పెయింటింగ్ ఎలా కొట్టాలో చెప్పాం. గేట్లు పెట్టి 40 సంవత్సరాలు పూర్తి అయింది. గేట్ల లైఫ్ ఉండేది ఇంకా అయిదు సంవత్సరాలే. ఇదే మాదిరి గేట్లు మెయింటైన్ చేస్తే మాత్రం 60, 70 సంవత్సరాలు ఇబ్బంది లేదు. ప్రభుత్వం డ్యామ్ గేట్లపై ప్రత్యేక దృష్టి సారించాలి. జీరో లీకేజీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని గేట్లు రస్టు పట్టి ఉన్నాయి. కొన్ని గేట్లకు పెయింట్ కొట్టాలి” అని తెలిపారు.
కాగా, జలవనరులశాఖ మెకానికల్ విభాగం సలహాదారుగా కన్నయ్య నాయుడు ఉన్నారు. హైడ్రాలిక్ గేట్లు, హ్యాండ్లింగ్ ఎక్విప్‌మెంట్ విషయాల్లో సలహాదారుగా కొనసాగుతున్నారు.