Telangana : రోడ్డున పడ్డ పంచాయతీ కార్యాలయం, టెంట్‌లోనే సర్పంచ్ విధుల నిర్వహణ

రోడ్డున పడంది ఓ పంచాయతీ కార్యాలయం..టెంట్ లోనే కూర్చుని గ్రామ సర్పంచ్ విధుల నిర్వహిస్తున్నారు. ఈ దుస్థితికి కారణం గురించి సర్పంచ్ ఏమంటున్నారంటే..

Telangana : రోడ్డున పడ్డ పంచాయతీ కార్యాలయం, టెంట్‌లోనే సర్పంచ్ విధుల నిర్వహణ

panchayat office under the tent IN Janagama district

Updated On : January 2, 2023 / 2:57 PM IST

Telangana panchayat office IN tent : అదో గ్రామం. గ్రామానికి పంచాయతీ కార్యాలయం ఉంటుంది కదా. కానీ ఆ గ్రామానికి మాత్రం పంచాయతీ కార్యాలమే లేదు. అంటే సొంత భవనమే లేదు. దీంతో రోడ్డు పక్కనే ఓ చిన్న టెంట్ వేసుకుని పంచాయతీ కార్యాయలం విధులన్నీ అక్కడే కూర్చుని నిర్వర్తిస్తున్నరు సర్పంచ్. రోడ్డు పక్కనే ఓ టెంట్ వేసుకుని అక్కడే ఓ టేబుల్..రెండు మూడు కుర్చీలు వేసుకుని విధులు టెంట్ నుంచి నిర్వహిస్తున్నారు. పోనీ అద్దె భవనంలోనైనా విధుల నిర్వహిద్దామనుకుంటే అదీ దొరకలేదు. ఎందుకంటే అద్దె కట్టేందుకు కూడా ఆ పంచాయతీకి డబ్బుల్లేవు..దీంతో వీధిన పడింది పంచాయతీ కార్యాలయం. దీంతో వేరే దారిలేక ఎటూ పాలుపోని పరిస్థితుల్లో ఆ గ్రామ సర్పంచ్‌, ఊర్లోనే రోడ్డు పక్కన టెంటు వేసి.. అందులో టేబుల్‌, రెండు కుర్చీలు వేసుకొని, పంచాయతీ కార్యదర్శిని కూర్చోబెట్టుకొని.. పక్కన ‘‘గ్రామ పంచాయతీ కార్యాలయం’’ అని బోర్డు పెట్టి మరీ విధులు నిర్వహిస్తున్నారు. ఈ దుర్భర పరిస్థితి ఉన్న ఆ గ్రామం పేరు వెంకటేశ్వర్లపల్లి.

పంచాయతీకి వచ్చే నిధులు అధికారులు దౌర్జన్యంగా లాగేసుకోవటంతో ఇలా ఏకంగా పంచాయతీ కార్యలయమే వీధినపడింది. తెలంగాణలోని జనగామ జిల్లా చిలుపూర్‌ మండలంలో ఉందీ వెంకటేశ్వర్లపల్లి.తమ గ్రామ పంచాయతీ కార్యలంయ దుర్భర పరిస్థితిని తెలియజేయటానికి ఇలా రోడ్డు పక్కనే టెంట్ వేసి వినూత్న నిరసన తెలుపుతున్నారు గ్రామ సర్పంచ్‌ తోకల దివాకర్‌ రెడ్డి. జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీల పునర్వవ్యవస్థీకరణలో భాగంగా వెంకటేశ్వర్లపల్లిని నూతన గ్రామ పంచాయతీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

అయితే ఇప్పటిదాకా గ్రామ పంచాయతీకి సొంత భవన నిర్మాణం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇన్నాళ్లుగా ఓ అద్దె ఇంట్లోనే ఆఫీసు ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహించారు. ఇటీవల ఆ అద్దె ఇంటిని ఖాళీ చేయాలంటూ యాజమాని చెప్పడంతో కార్యాలయానికి మరో అద్దె గృహం కోసం వెతికినా అద్దె కట్టలేని పంచాయితీ ఆఫీసుకు అద్దెకు ఇవ్వలేమని చెప్పేసిన పరిస్థితి. దీంతో ఊర్లోనే రోడ్డు పక్కన షామియానా కింద కార్యాలయం ఏర్పాటు చేసి విధులు నిర్వహించటం మొదలుపెట్టారు. పంచాయతీకి వచ్చిన నిధులను సర్పంచ్ చేతికి చిక్కకుండా అధికారులు ఇతర పనులు వినియోగించారట. దీంతో అద్దె కట్టలేకి సర్పంచ్ పంచాయతీ కార్యాలయాన్ని రోడ్డు పక్కనే ఓ టెంట్ వేసి దాంట్లో నిర్వహించటం మొదలుపెట్టారు. అలా తన నిరసనను తెలియజేస్తున్నారు.