Pending Challans: పెండింగ్ ట్రాఫిక్ చలానాల డిస్కౌంట్ గడువు పొడిగింపు

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించుకునేందుకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేర గడువు తేదీ మార్చి 31తో ముగియనుండగా మరో గుడ్ న్యూస్..

Pending Challans: పెండింగ్ ట్రాఫిక్ చలానాల డిస్కౌంట్ గడువు పొడిగింపు

Pending Challan

Updated On : March 30, 2022 / 9:11 PM IST

Pending Challans: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించుకునేందుకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేర గడువు తేదీ మార్చి 31తో ముగియనుండగా మరో గుడ్ న్యూస్ వినిపించారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని తెలిపారు.

ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల 40 లక్షల చలాన్లను చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి. పెండింగ్ చలాన్ల చెల్లింపు ద్వారా ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరినట్లు చెబుతున్నారు.

ప్రజల నుంచి‌ వస్తున్న స్పందన, విజ్ఞప్తి మేరకు మరో పదిహేను రోజుల పాటు అంటే ఏప్రిల్ 15వ తేదీ వరకు రాయితీ అవకాశాన్ని పొడిగించినట్లు తెలిపారు.

Read Also : పెండింగ్ ట్రాఫిక్ చాలానాల ద్వారా రూ. 112.98 కోట్లు ఆదాయం

ఇప్పటివరకూ చలాన్లు చెల్లించలేక పోయినవాళ్లు రాయితీ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ-చలాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా చలాన్ క్లియర్ చేసుకోవాల్సిందిగా సూచించారు.