TS Polycet-2022 : తెలంగాణ పాలిసెట్ -2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఆగస్టు 1 నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 1న తుది విడత స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 2వ తేదీన సర్టిఫికెట్స్ పరిశీలన జరుగనుంది. 1 నుంచి 3వ తేదీ వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు.

Ts Polycet
Telangana Polycet-2022 : తెలంగాణ రాష్ట్ర పాలిసెట్-2022 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా అధికారులు రిలీజ్ చేశారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు అభ్యర్థుల సర్టిఫికేట్స్ పరిశీలన జరగనుంది.
సర్టిఫికేట్స్ పరిశీలన పూర్తైన అభ్యర్థులు 20 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 27న సీట్లను కేటాయించనున్నారు. 27 నుంచి 31వ తేదీ వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు.. ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
Agriculture Exam postponed : ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా..ఇంజినీరింగ్ యథాతథం
ఆగస్టు 1 నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 1న తుది విడత స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 2వ తేదీన సర్టిఫికెట్స్ పరిశీలన జరుగనుంది. 1 నుంచి 3వ తేదీ వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 6న సీట్ల కేటాయింపు జరుగనుంది.
సీట్లు పొందిన అభ్యర్థులు 6 నుంచి 10వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 17 నుంచి పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 8న పాలిసెట్ స్పాట్ అడ్మిషన్ల విధి విధానాలను అధికారులు వెల్లడించనున్నారు.