Telangana Power Demand : తెలంగాణ చరిత్రలోనే రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం, ఒక్కరోజే..
తెలంగాణలో రోజురోజుక విద్యుత్ వినియోగం పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చరిత్రలో తొలిసారి రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నెలకొంది. ఇవాళ(ఫిబ్రవరి 28) మధ్యాహ్నం నాటికి 14వేల 794 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. గతేడాది ఇదే రోజు తెలంగాణలో 12వేల 996 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది.

Telangana Power Demand : తెలంగాణలో రోజురోజుక విద్యుత్ వినియోగం పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చరిత్రలో తొలిసారి రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నెలకొంది. ఇవాళ(ఫిబ్రవరి 28) మధ్యాహ్నం నాటికి 14వేల 794 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. గతేడాది ఇదే రోజు తెలంగాణలో 12వేల 996 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. నిన్న(ఫిబ్రవరి 27) రాష్ట్రవ్యాప్తంగా 14వేల 501 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఇవాళ మరింత పెరిగి 14వేల 794 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది.
తెలంగాణలో సాగు విస్తీరణం పెరిగింది. దీనికి తోడు పారిశ్రామిక అవసరాలు కూడా పెరిగాయి. దీంతో విద్యుత్ కు భారీ డిమాండ్ నెలకొంది. తెలంగాణలో మొత్తం విద్యుత్ వినియోగంలో 37శాతం వ్యవసాయ రంగానికే ఉపయోగిస్తున్నారు. దేశంలోనే వ్యవసాయ రంగానికి అత్యధిక కరెంట్ వినియోగిస్తున్న రాష్ట్రం తెలంగాణనే. ఇక ఈ వేసవిలో తెలంగాణలో రోజుకు 16వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. డిమాండ్ ఎంత ఉన్నా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని చెబుతున్నారు టీఎస్ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు.
Also Read..Electricity Demand : తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
గడిచిన కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. మంగళవారం అత్యధిక విద్యుత్ వినియోగం నమోదైంది. సాగు , పారిశ్రామిక విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు వేసవి మొదలైపోయినట్టుగా పరిస్థితులు ఉన్నాయి. వేసవి తాపం తట్టుకోలేక ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల తెగ వాడేస్తున్నారు. విద్యుత్ వినియోగం పెరగాడినికి ఇదీ ఒక కారణం కావొచ్చు. ఒక్కరోజులో అత్యధిక విద్యుత్ వినియోగంలో దేశంలోనే తొలి స్థానంలో కర్నాటక రాష్ట్రం ఉండేది. ఆ రికార్డును తెలంగాణ రాష్ట్రం బ్రేక్ చేసింది.