రెయిన్ అలర్ట్.. తెలంగాణలో నాలుగు రోజులు దంచికొట్టనున్న వానలు.. ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త.. హైదరాబాద్‌లోనూ దంచికొడుతున్న వర్షం..

తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

రెయిన్ అలర్ట్.. తెలంగాణలో నాలుగు రోజులు దంచికొట్టనున్న వానలు.. ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త.. హైదరాబాద్‌లోనూ దంచికొడుతున్న వర్షం..

Updated On : July 18, 2025 / 7:30 AM IST

Telangana Rains: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆర్తన ప్రభావంతో రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలకుతోడు బలమైన గాలులూ వీస్తాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు.. హైదరాబాద్ లోనూ రెండు రోజులు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది.

Also Read: కేటీఆర్ చెల్లి కవితే ఒప్పుకోవడం లేదు.. వాళ్లతో చర్చకు నేను పోను: సీఎం రేవంత్ రెడ్డి

గురువారం హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. మంచిర్యాల, ఖమ్మం, సూర్యాపేట, పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సిద్ధిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, నల్గొండతోపాటు పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లో 8.5సెంటీ మీటర్లు వర్షం కురిసింది.

శుక్రవారం నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
శనివారం వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఆదివారం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని, అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్టును జారీ చేసింది.