Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు..

Telangana Corona Cases

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. నిన్నటితో(1,963) పోలిస్తే కేసులు పెరిగాయి.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 55వేల 883 మందికి కరోనా పరీక్షలు చేయగా… 2వేల 047 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,174 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 178, రంగారెడ్డి జిల్లాలో 140 కేసులు వెల్లడయ్యాయి.

Block Unknown Numbers : ఈ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గుర్తుతెలియని నెంబర్లను ఇలా బ్లాక్ చేయండి..!

అదే సమయంలో 2వేల 013 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో ముగ్గురు కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,09,209 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,83,104 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో 22వేల 048 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,057కి పెరిగింది.

కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ కట్టడికి మళ్లీ కఠినమైన ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ఇక విద్యాసంస్థలకు ఈనెల 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించేందుకు రెడీ అవుతోంది. సోమవారం(జనవరి 17) మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది.

Eating Egg : రోజూ కోడి గుడ్డు తింటే మధుమేహం ముప్పు

ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి సీఎం కేసీఆర్ ఓ ప్రకటన చేయనున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారా? లేక నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారా? సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడికి వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.