Telangana Corona Bulletin Report : తెలంగాణలో తగ్గిన కరోనా.. 16వేల టెస్టులు చేస్తే 24 కేసులు వెల్లడి

తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో..

Telangana Covid Report

Telangana Corona Bulletin Report : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 16వేల 580 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 24 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 14 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరో 40 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కరోనా మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో ఇంకా 232 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. నేటివరకు రాష్ట్రంలో 7,91,485 కరోనా కేసులు నమోదవగా.. 7,87,142 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 16వేల 610 కరోనా టెస్టులు నిర్వహించగా.. 35 మందికి పాజిటివ్ గా తేలింది.(Telangana Corona Bulletin Report)

Covid Vaccine: భారీగా తగ్గిన కొవిడ్ వ్యాక్సిన్ ధర.. రూ.225మాత్రమే

దేశంలో కరోనావైరస్ కట్టడిలోనే ఉంది. తాజాగా 4.6 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,150 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. క్రితంరోజు కంటే కాస్త అధికంగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో మరో 1,194 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 11వేల 365కి తగ్గి ఊరటనిస్తున్నాయి.

ఇక నిన్న మరో 83 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల్లో హెచ్చుతగ్గులకు కేరళ మునుపటి గణాంకాలను సవరిస్తుండటమే కారణం. ఆ ఒక్క రాష్ట్రమే 75 మరణాలను వెల్లడించింది. ఈ రెండేళ్ల కాలంలో 4.30 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 98.76 శాతం మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. బాధితుల సంఖ్య 0.03 శాతానికి తగ్గిపోయింది. మరణాలు రేటు 1.21 శాతంగా ఉంది. ఇక నిన్న 14.7 లక్షల మంది టీకా తీసుకోగా.. నిన్నటివరకూ 185 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.

ఇది ఇలా ఉంటే.. వ్యాక్సిన్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. వ్యాక్సిన్ ధరలు తగ్గించాయి. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఆదివారం నుంచి ప్రికాషన్‌ డోసు పంపిణీ ప్రారంభం కానున్న సమయంలో వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, భారత్‌ బయోటెక్‌.. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకా ధరలను భారీగా తగ్గించాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ టీకాల ధరలు రూ.225గా ఉండనున్నట్లు ప్రకటించాయి. 18ఏళ్లు పైబడిన వారు ప్రికాషన్‌ డోసులను ప్రైవేటు కేంద్రాల్లో మాత్రమే తీసుకోవాలని కేంద్రం తెలిపిన నేపథ్యంలో టీకా తయారీ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

XE variant : దేశంలో ఎక్స్ఈ వేరియంట్ కలకలం.. గుజరాత్‌లో తొలికేసు నమోదు..

ప్రైవేటు ఆసుపత్రులకు కొవిషీల్డ్‌ టీకా డోసు ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గిస్తున్నట్లు సీరమ్‌ సీఈఓ అదర్‌ పూనావాలా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పూనావాలా తెలిపారు. అటు భారత్‌ బయోటెక్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ప్రైవేటు ఆసుపత్రులకు కొవాగ్జిన్‌ టీకా డోసు ధరను రూ.1200 నుంచి రూ.225కు తగ్గించాలని నిర్ణయించినట్లు భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్లా వెల్లడించారు.