Telangana Corona List : తెలంగాణలో కొత్తగా 32 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 18వేల 246 కరోనా పరీక్షలు నిర్వహించగా, 32 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.(Telangana Corona List)

Telangana Covid Report

Telangana Corona List : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 18వేల 246 కరోనా పరీక్షలు నిర్వహించగా, 32 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 67 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,91,213 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,86,645 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో ఇంకా 457 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజుతో పోలిస్తే కొత్తగా రెండు కేసులు పెరిగాయి. ముందు రోజు 17వేల 806 కరోనా పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Corona List)

అటు దేశంలోనూ కరోనావైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. మహమ్మారి ప్రారంభ రోజుల నాటి స్థాయికి వైరస్ వ్యాప్తి తగ్గింది. కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదవుతున్నాయి.

India Covid-19 : కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం.. మార్చి 31 నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబందనలు పూర్తిగా ఎత్తివేత

సోమవారం 5.7 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,259 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే స్వల్పంగా కేసులు తగ్గాయి. 24 గంటల వ్యవధిలో మరో 35 మంది కోవిడ్ తో మృతి చెందారు. యాక్టివ్ కేసులు 15,378కి తగ్గాయి. దాంతో మొత్తం కేసుల్లో వాటి వాటా 0.04 శాతానికి చేరింది.

నిన్న మరో 1,700 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దాంతో రికవరీ రేటు 98.75 శాతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 4.30 కోట్ల మందికి కరోనా సోకగా..5.21 లక్షల మంది మరణించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం ప్రారంభించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటివరకు 183 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 25.9 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారమిచ్చారు.

Covid Vaccine: భారత్ లో 12-18 ఏళ్ల వారికి అత్యవసర వినియోగ నిమిత్తం నోవావాక్స్ కు డీజీసీఐ అనుమతి

దేశంలో కొవిడ్ విజృంభించడంతో దాదాపు రెండేళ్ల క్రితం వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పలుమార్లు వీటిలో మార్పులు, చేర్పులు చేసింది. అయితే, గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.