Telangana Corona Cases : కరోనా పంజా.. ఒక్కరోజే 3,557 కేసులు, ముగ్గురు మృతి

తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 24వేల 253 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Telangana Corona Cases

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో ఒక లక్ష 11వేల 178 కరోనా పరీక్షలు చేయగా, కొత్తగా 3వేల 557 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,474 కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 7,18,196కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

Alcohol : మద్యం సేవిస్తే హాయిగా నిద్రపడుతుందా? ఇందులో నిజమెంత?

గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో మరో ముగ్గురు చనిపోయారు. రాష్ట్రంలో కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,065కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,773 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24వేల 253 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా, నిన్నటితో పోలిస్తే 574 కేసులు అధికంగా రావడం ఆందోళనకు గురి చేస్తోంది.

Corona Medicines : హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన మందులు.. ప్రభుత్వం మార్గదర్శకాలు