Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 425 కరోనా కేసులు

గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 425 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 130 కొత్త కేసులు వెల్లడయ్యాయి.

Telangana Corona Cases

Telangana Corona Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కోవిడ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 425 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 130 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 29, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28, నల్గొండ జిల్లాలో 23, ఖమ్మం జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 1,060 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించ లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,86,021 మంది కరోనా బారినపడగా వారిలో 7,75,802 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6వేల 111 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,108. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41,042 కరోనా పరీక్షలు చేశారు. క్రితం రోజుతో(453 కేసులు) ఇవాళ కరోనా కేసులు తగ్గాయి.

Telangana : కరోనా వ్యాక్సినేషన్.. దేశంలోనే తెలంగాణ టాప్

దేశంలో ఒమిక్రాన్ వేవ్ క్రమంగా అదుపులోకి వస్తోంది. దీంతో కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా కొత్త కేసులు 25 వేలకు దిగొచ్చాయి. పాజిటివిటీ రేటు కూడా రెండు శాతానికి చేరింది. గురువారం 12,54,893 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 25వేల 920 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. క్రితం రోజు కంటే 4వేల 837 కేసులు తక్కువగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 2.07 శాతానికి తగ్గిపోయింది. ఇక ఇప్పటివరకూ 4.27 కోట్ల మందికి కరోనా సోకింది.

Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 453 కరోనా కేసులు

కోవిడ్ మరణాలు కూడా అదుపులోనే ఉంటున్నాయి. నిన్న 492 మరణాలు నమోదు కాగా.. మొత్తం ఆ సంఖ్య 5.10 లక్షలు దాటింది. నిన్న 66,254 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొంతకాలంగా కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ఈ రెండేళ్ల వ్యవధిలో 4.19 కోట్ల మంది కోలుకోగా.. మొత్తం కేసుల్లో ఆ వాటా 98 శాతానికి పైగానే ఉంది. వైరస్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం మూడు లక్షల దిగువకు చేరాయి. ఇక నిన్న 37.8 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 174 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.