Telangana Covid Report
Telangana Covid Report Latest : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంట్లలో 11వేల 984 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 43 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 26 పాజిటివ్ కేసులు వచ్చాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 45 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో ఇంకా 423 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. నేటివరకు రాష్ట్రంలో 7లక్షల 93వేల 133 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 599 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం రాత్రి కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 13వేల 170 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 46 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
అటు దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. స్వల్ప హెచ్చు తగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 4.47 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2వేల 685 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతంగా ఉంది.(Telangana Covid Report Latest)
Cancer Injection : క్యాన్సర్ ను ఖతం చేసే ఇంజెక్షన్.. రోగిపై మొదటిసారి ప్రయోగించిన పరిశోధకులు
అదే సమయంలో 24 గంటల వ్యవధిలో మరో 2వేల 158 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మరో 33 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకూ 4.31 కోట్లకు పైగా కేసులు రాగా.. అందులో 98.75 శాతం మంది కొవిడ్ ను జయించారు. నేటివరకు దేశంలో కరోనాతో 5.24 లక్షల మందికి పైగా మరణించారు. దేశంలో ఇంకా 16వేల 308 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దాంతో యాక్టివ్ కేసుల రేటు 0.04 శాతంగా నమోదైంది.
మహమ్మారి కట్టడికి గతేడాది కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 12 ఏళ్లు, ఆపై వయసు వారు టీకా తీసుకుంటున్నారు. కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రికాషనరీ డోసులు కూడా వేస్తోంది. దాంతో ఇప్పటివరకూ పంపిణీ అయిన డోసుల సంఖ్య 193 కోట్ల మార్కును దాటింది. ఒక్కరోజు వ్యవధిలో 14.39 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. ప్రమాదకరమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో తొలిసారి బీఏ.4, బీఏ.5 కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో తాజాగా నాలుగు బీఏ.4 కేసులు, మూడు బీఏ.5 కేసులు నమోదైనట్టు డాక్టర్లు ప్రకటించారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల బారిన పడిన ఏడుగురికీ స్వల్ప లక్షణాలే ఉన్నట్లు తెలిపారు. కాగా వీరంతా పుణెకు చెందినవారు కావడం గమనార్హం. వారందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు వివరించారు.
Watching TV : గంటలకొద్ది టీవీ చూసేవారిలో గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ.. కొత్త అధ్యయనం హెచ్చరిక!
ఈ ఏడుగురిలో ముగ్గురు మహిళలు, తొమ్మిదేళ్ల బాలుడు ఉన్నాడు. వైరస్ బారిన పడినవారిలో ఇద్దరు విదేశాలకు వెళ్లి వచ్చారని, మరో ముగ్గురు ఇతర రాష్ట్రాలకు ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరు మాత్రం ఎక్కడికీ వెళ్లలేదని తెలిపారు. బాలుడు మినహా మిగతా ఆరుగురు కూడా వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో తీసుకున్నారని, ఓ వ్యక్తి బూస్టర్ డోసు కూడా తీసుకున్నట్లు పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో వ్యాప్తి చెందిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ.4, బీఏ.5లు భారత్‌లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) కొద్దిరోజుల క్రితమే వెల్లడించించిన విషయం తెలిసిందే. తమిళనాడు, తెలంగాణలో ఈ కేసులు ఇప్పటికే బయటపడ్డాయి.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.28.05.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/wfAs4RwRGD— IPRDepartment (@IPRTelangana) May 28, 2022