Watching TV : గంటలకొద్ది టీవీ చూసేవారిలో గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ.. కొత్త అధ్యయనం హెచ్చరిక!

Watching TV Heart Risk : అదే పనిగా టీవీ చూసే అలవాటు ఉందా? అయితే తస్మాత్ జాగ్రత్త.. గంటల కొద్ది టీవీలకు అతుక్కుపోయేవారికి హెచ్చరిక..

Watching TV : గంటలకొద్ది టీవీ చూసేవారిలో గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ.. కొత్త అధ్యయనం హెచ్చరిక!

Watching Tv For Long Hours Can Increase Risk Of Heart Disease, New Study Reveals (1)

Watching TV Heart Risk : అదే పనిగా టీవీ చూసే అలవాటు ఉందా? అయితే తస్మాత్ జాగ్రత్త.. గంటల కొద్ది టీవీలకు అతుక్కుపోయేవారికి హెచ్చరిక.. గ్యాప్ లేకుండా ఎక్కువ సమయం టీవీ చూస్తున్నవారిలో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నాయని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. టైంఫాస్ కోసం టీవీ చూడటం మంచిదే కానీ, ఏదైనా అతిగా చేస్తే అది అనార్థాలకు దారితీస్తుంది. టీవీ కూడా ఎక్కువ గంటలు చూడటం ద్వారా అది మీ గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని అధ్యయనం చెబుతోంది. ఈ కొత్త అధ్యయనం ప్రకారం.. ఎక్కువసేపు టెలివిజన్ చూసే అలవాటు ఉన్నవారికి కొరోనరీ హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుందని అధ్యయనంలో రుజువైంది. టీవీ చూడటం లేదా కంప్యూటర్‌ను వంటి స్క్రీన్-ఆధారిత కార్యకలాపాలతో కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకునేందుకు పరిశోధకులు UK బయోబ్యాంక్ నుంచి డేటాను సేకరించి అధ్యయనం చేశారు.

కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, హాంకాంగ్ యూనివర్శిటీకి చెందిన నిపుణుల బృందం నిర్వహించిన అధ్యయనంలో ప్రతిరోజూ ఒక గంట కంటే తక్కువ సమయం పాటు టెలివిజన్ చూడటం వలన కరోనరీ హార్ట్ డిసీజ్ సంభవించే రిస్క్‌ను11 శాతం వరకు నిరోధించవచ్చని వెల్లడించింది. విశ్రాంతి సమయాల్లో కంప్యూటర్‌తో గడిపిన వారిపై ఈ వ్యాధి రిస్క్ ప్రభావం లేదని పరిశోధకులు కనుగొన్నారు. రోజుకు నాలుగు గంటల కంటే ఎక్కువసేపు టెలివిజన్ చూసే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. రోజుకు రెండు నుంచి మూడు గంటలు టెలివిజన్ చూసే వ్యక్తుల్లో ఈ రిస్క్ రేటు 6 శాతం తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.

Watching Tv For Long Hours Can Increase Risk Of Heart Disease, New Study Reveals

Watching Tv For Long Hours Can Increase Risk Of Heart Disease, New Study Reveals

ఒక గంట కంటే తక్కువ టెలివిజన్ చూసిన వ్యక్తులు సాపేక్షంగా 16 శాతం తక్కువ రేటును కలిగి ఉన్నారని అధ్యయనం వెల్లడించింది. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 5లక్షల కంటే ఎక్కువ మంది వ్యక్తుల పాలిజెనిక్ రిస్క్ స్కోర్‌లపై అధ్యయనం జరిపారు. జన్యుపరంగా ఇతరులతో పోలిస్తే పాలిజెనిక్ రిస్క్ స్కోర్ అనేది ఒక్కో వ్యక్తిలో స్వతంత్రగా ఉన్నాయని గుర్తించారు. కరోనరీ హార్ట్ డిసీజ్‌కు ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకేచోట కదలకుండా ఎక్కువ సమయం కూర్చొవడమేనని చాలా మంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రాథమికంగా, శారీరకంగా, చురుకుగా ఉండటానికి తప్పనిసరిగా వ్యాయామం చేయాలని, ఎక్కువసేపు కూర్చోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : Sugar mountains : సముద్ర గర్భంలో పంచదార కొండలను కనుగొన్న పరిశోధకులు..