Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 569 కరోనా కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో 569 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,098 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో కరోనా మరణాలేవీ సంభవించ లేదు.

Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 569 కరోనా కేసులు

Telangana Corona Cases

Updated On : February 15, 2022 / 10:44 PM IST

Telangana Corona Cases : తెలంగాణలో గత 24 గంటల్లో 569 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 51,518 కరోనా పరీక్షలు చేశారు. అదే సమయంలో 2,098 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో కరోనా మరణాలేవీ సంభవించ లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో 133 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 49, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 37, నల్గొండ జిల్లాలో 33 కేసులు వెలుగు చూశాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,84,631 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,72,145 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో 8వేల 379 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రితం రోజుతో(614) పోలిస్తే ఇవాళ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది.

WHO Warn Covid : కరోనా ఇంకా పోలేదు.. మరిన్ని వేరియంట్లు ఏ క్షణమైనా విజృంభించొచ్చు… WHO సైంటిస్ట్ హెచ్చరిక..!

ఏపీలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. క్రితం రోజుతో(434) పోలిస్తే మంగళవారం కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 22వేల 267మందికి కరోనా పరీక్షలు చేయగా 615మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ తో మరో నలుగురు చనిపోయారు.

చిత్తూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో కరోనాతో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అదే సమయంలో ఒక్కరోజే 2వేల 787 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 23,13,827. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,86,575. రాష్ట్రంలో 12వేల 550 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ తో చనిపోయిన వారి సంఖ్య 14వేల 702కి పెరిగింది. నేటి వరకు రాష్ట్రంలో
3,28,69,245 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజాగా రోజువారీ కేసుల సంఖ్య 30 వేల దిగువకు చేరడం రిలీఫ్ ఇచ్చే అంశం. మరోవైపు మరణాల సంఖ్య కూడా 350లోపే నమోదైంది. గడిచిన 24 గంటల్లో 12,29,536 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 27వేల 409 కేసులు
నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.23 శాతానికి పడిపోయింది. తాజాగా మరో 347మంది కోవిడ్ తో చనిపోయారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,09,358కి చేరింది.

Hyderabad : కాలుష్యం నుంచి బయటపడుతున్న మూసీ, హుస్సేన్ సాగర్‌లు

కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదవుతుండటం సానుకూలాంశం. గడిచిన 24 గంటల్లో 82వేల 817 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.17 కోట్లు దాటింది. రికవరీ రేటు 97.82%కి పెరిగింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్యా గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో 4,23,127 కోవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ రేటు 1 శాతం దిగువకు (0.99%) తగ్గింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. నిన్న 44,68,365 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 173 కోట్లు దాటింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల తెలిపింది.