WHO Warn Covid : కరోనా ఇంకా పోలేదు.. మరిన్ని వేరియంట్లు ఏ క్షణమైనా విజృంభించొచ్చు… WHO సైంటిస్ట్ హెచ్చరిక..!

ప్రపంచాన్ని గత రెండేళ్లకుపైగా కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మరో కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్ల రూపంలో విరుచుకుపడుతున్నాయి.

WHO Warn Covid : కరోనా ఇంకా పోలేదు.. మరిన్ని వేరియంట్లు ఏ క్షణమైనా విజృంభించొచ్చు… WHO సైంటిస్ట్ హెచ్చరిక..!

Who Warn Covid Covid Hasn't

WHO Warn Covid Variants : ప్రపంచాన్ని గత రెండేళ్లకుపైగా కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మరో కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్ల రూపంలో విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే అల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ అంటూ పలు వేరియంట్లు ప్రపంచ దేశాలను బెంబేలిత్తించాయి. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. కరోనా కేసులు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు విధించిన లాక్‌డౌన్లు, కర్ఫ్యూ ఆంక్షలను సైతం క్రమంగా సడలిస్తు వస్తున్నాయి. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మినహా అన్ని ప్రాంతాల్లోనూ ఆంక్షలను ఎత్తేస్తున్నాయి. కరోనా నిబంధనలతో రోజువారీ కార్యకలాపాలకు అనుమతినిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. ప్రపంచ జనాభాకు దాదాపు వ్యాక్సిన్ డోసులు అందగా.. బూస్టర్ డోసు ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో కేసులు భారీగా పెరిగినప్పటికీ మరణాల సంఖ్య ఇతర వేరియంట్లతో పోలిస్తే చాలా తక్కువగానే ఉన్నాయి. దాంతో ఒమిక్రాన్ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పలు అధ్యయనాలు కూడా సూచించాయి. ఒమిక్రాన్ కేసుల తీవ్రత కూడా క్రమంగా తగ్గుతోంది. ఇక కరోనావైరస్ అంతమైపోయినట్టే… ఇదే చివరి వేరియంట్ అనే వాదన వినిపిస్తోంది.

కరోనా పోలేదింకా.. నిర్లక్ష్యం వద్దు.. మాస్క్ మరువొద్దు.. 
కరోనా ఇంకా పోలేదని.. అంతమైపోయిందిలే అనే భ్రమలో ఉండొద్దని ప్రపంచ ఆరోగ్యం సంస్థ హెచ్చరిస్తోంది.
ఇకపై ఎప్పటిలానే మాస్క్ లు లేకుండా సాధారణ జీవితాన్ని గడపొచ్చులే అనుకుంటే పొరపాటే అంటోంది WHO.. కరోనా తీవ్రత తగ్గిందే తప్పా.. కరోనావైరస్ పూర్తిగా అంతమైపోలేదని WHO సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలాని, సామాజిక దూరంతో కొవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని సూచిస్తున్నారు.

కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని, రానున్న రోజుల్లో మరిన్ని కొత్త వేరియంట్లు విజృంభించే ముప్పు పొంచి ఉందని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ (Soumya Swaminathan) హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని అన్నారు.

మహమ్మారి ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ ఊహించలేరు :
మరిన్ని కరోనావైరస్ వేరియంట్లు విరుచుకుపడే ముప్పు లేకపోలేదన్నారు. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్‌ (Tedros Adhanom Ghebreyesus)తో కలిసి దక్షిణాఫ్రికాలో వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను సందర్శించిన సందర్భంగా స్వామినాథన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బ్లూమ్‌బెర్గ్‌ (Bloomberg)కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ.. మహమ్మారి ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ ఊహించలేరని స్వామినాథన్ స్పష్టం చేశారు. మహమ్మారి ముగిసిందని ఎలాంటి ప్రకటనలు చేయొద్దని ఆమె సూచించారు.

కరోనా పరిస్థితుల్లో ఎలాంటి నిబంధనలను జాగ్రత్తలను పాటించామో ఇకపై కూడా అలానే కొనసాగించాలని సూచించారు. కరోనా తగ్గిపోయింది కదా అని మూర్ఖంగా ప్రవర్తించరాదని, లేదంటే మరిన్ని కరోనా వేరియంట్ల ముప్పు తప్పదని ఆమె హెచ్చరించారు.

2022 నాటికి కరోనా తీవ్రత తగ్గొచ్చు.. ఏదైనా వేరియంట్ రావొచ్చు..
2022 చివరి నాటికి కరోనా తీవ్రత మరింత తగ్గిపోతుందని అంచనా వేస్తున్నామని స్వామినాథన్ పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ సమయంలో మరో ఏదైనా కరోనా వేరియంట్ ఎక్కడైనా విజృంభించే ముప్పు తలెత్తవచ్చునని అన్నారు. ఇప్పటివరకూ ఎదురైన కరోనా పరిస్థితుల్లో అన్ని వేరియంట్లను మనమంతా జాగ్రత్తగా ఎదుర్కుంటూ వచ్చాయి.. ఇకనుంచి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని స్వామినాథన్ తెలిపారు. కరోనా విషయంలో ఇతర శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే వైరస్‌తో ఎలా జీవించాలో ప్రపంచం రానున్న రోజుల్లో మరింత నేర్చుకోనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ స్వామినాథన్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇతర వేరియంట్లను సైతం సమర్థవంతంగా ఎదుర్కొగలదని, ప్రస్తుత వ్యాక్సిన్లతో పాటు మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కరోనా తగ్గినప్పటికీ.. సాధారణ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ లేదా ఫ్లూ ఏదైనా వచ్చినా ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడం మంచిదని, కొవిడ్ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్వామినాథన్ సూచించారు.

Read Also : Semaglutide Drug : ప్రపంచానికి గుడ్‌న్యూస్.. అధిక బరువును తగ్గించే సరికొత్త డ్రగ్.. ఇదో గేమ్‌ఛేంజర్..!