Telangana Corona Case Bulletin : తెలంగాణలో కొత్తగా 15 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 12వేల 952 కరోనా పరీక్షలు నిర్వహించగా..

Telangana Corona Case Bulletin : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 12వేల 952 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 15 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 9 పాజిటివ్ కేసులు వచ్చాయి. అదే సమయంలో 24 గంటల వ్యవధిలో మరో 30 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కరోనా మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో ఇంకా 220 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. రాష్ట్రంలో నేటివరకు 7,91,595 కరోనా కేసులు నమోదవగా.. 7,87,264 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 13వేల 748 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 19మందికి పాజిటివ్ గా తేలింది.(Telangana Corona Case Bulletin)

Covid Xe Variant : కొత్త రూపంలో కరోనా..ఈ లక్షణాలను గుర్తించండి..అప్రమత్తమవ్వండి

అటు దేశంలో కరోనావైరస్ మహమ్మారి అదుపులోనే ఉంది. కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో వెయ్యికి సమీపంలోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుండటం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3లక్షల 67వేల 213 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 949 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్కరోజు వ్యవధిలో మరో ఆరుగురు కోవిడ్ తో మృతి చెందారు. ఇప్పటివరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,21,743కు చేరింది. కొత్త కేసుల కంటే రికవరీలు కాస్త తక్కువగా ఉన్నాయి. నిన్న మరో 810 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.25 కోట్లు దాటింది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది.

ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య స్పల్పంగా పెరిగి 11వేల 191కు చేరింది. ఆ రేటు 0.03%గా ఉంది. ఇక టీకా కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 6,66,660 మందికి టీకాలు వేయగా.. ఇప్పటి 186.30 కోట్ల డోసులను పంపిణీ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Covid-19 Guidelines : ఢిల్లీ NCRలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. స్కూళ్ల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు..!

కాగా, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. అంతకుముందు రోజు అక్కడ 299 కేసులు నమోదు కాగా.. నిన్న 325 కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే మరణాలు నమోదుకాకపోవడం రిలీఫ్ ఇస్తోంది.

ప్రపంచ దేశాల్లో కొవిడ్ మహమ్మారి తగ్గుముఖం పడుతున్న వేళ వైరస్ పుట్టినిల్లు చైనాలో మాత్రం మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా అక్కడ కరోనా ఆంక్షలు అమలు అవుతున్నాయి. ఇప్పటికే షాంఘైతోపాటు పలు నగరాల్లో పూర్తి లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో స్థానికంగా కొవిడ్‌ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. దీంతో ప్రస్తుతం చైనాలో 40కోట్ల మంది ఆంక్షల గుప్పిట్లో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు