Covid Xe Variant : కొత్త రూపంలో కరోనా..ఈ లక్షణాలను గుర్తించండి..అప్రమత్తమవ్వండి

కొత్త రూపంలో కరోనా గురించి అవగాహన చేసుకోవాల్సిన అసవరం ఉంది. కొత్త కరోనా లక్షణాలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Covid Xe Variant : కొత్త రూపంలో కరోనా..ఈ లక్షణాలను గుర్తించండి..అప్రమత్తమవ్వండి

Covid 19 Xe Variant Fears

Covid Xe Variant  : కరోనా కొత్త రూపాల్లో ఇంకా భయపెడుతునే ఉంది. కొత్త కొత్త రూపాల్లో కొత్త లక్షణాలతో దాడి చేస్తునే ఉంది. దేశంలో కరోనా ఒమిక్రాన్ కేసులు గణనీయంగా తగ్గిపోయినా..కొత్తగా వెలుగులోకి వచ్చిన Xe వేరియంట్ కేసులు ఆందోళన పెడుతున్నాయి. జులై నెలలో ఫోర్త్ వేవ్ వస్తుందని నిపుణులు అంచనాలు వేస్తున్న క్రమంలో కరోనా కొత్త లక్షణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గొంతునొప్పి, ముక్కు కారటం, తలనొప్పి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ల వద్దకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా వైరస్ నాలుగో విడత జూన్ లేదా జులై నుంచి మొదలవుతుందని కొద్ది మంది నిపుణులు అంచనా వేస్తుంటే.. కొందరు మాత్రం ఇంకో వేవ్ ఉండదంటున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ కు సంబంధించి లక్షణాలపై అవగాహన కలిగిఉండాల్సిన అసవరం ఎంతైనా ఉంది.

కరోనా వైరస్ ఇప్పటికీ స్ట్రాంగ్ గానే ఉందని జాగ్రత్తలు మానవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించింది. సంక్షోభం మధ్య దశలోనే ఉన్నామని, టీకాలు తీసుకోని, రక్షణ చర్యలు పాటించని వారికి ఇది ప్రాణాంతకం అవుతుందని హెచ్చరించింది. కానీ..భయపడాల్సిన పని లేదని..అలాగే నిర్లక్ష్యం ఏమాత్రం తగదు అని హెచ్చరించింది. ఎవరికి వారు సొంతగా జాగ్రత్తలు తీసుకోవవటం చాలా చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా ఒమిక్రాన్ వేరియంట్ లోనే పలు ఉప రకాల కేసులు కొన్ని దేశాల్లో నమోదవుతున్నాయి. Xe, XF, Ed ఇలా కొత్త రకాలు వచ్చాయి. ఒమిక్రాన్ ఉపరకాల కలయికతో ఏర్పడినవే ఇవి. ఇందులో ఎక్స్ఈ రకానికి వేగంగా వ్యాపించే లక్షణం ఎక్కువని పరిశోధనల్లో తేలింది.
గుర్తించాల్సిన లక్షణాలు..
కరోనా వైరస్ లో లక్షణాలను గుర్తించడం చాలా కీలకంగా ఉంది. ఎక్కువ మందిలో గొంతు నొప్పి లేదా మంట, ముక్కు కారటం, దగ్గు, తలనొప్పి, అలసట కనిపిస్తుంటాయి. మొదటి విడతలో వాసన, రుచి తెలియలేదు కానీ, ఆ తర్వాత వేరియంట్లలో ఈ లక్షణాలు కనిపించలేదు. గతంలో ఇన్ఫెక్షన్ బారిన పడినవారు, కరోనా టీకాలు తీసుకున్న వారికి బలమైన రక్షణ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కొత్తగా గుర్తించిన వేరియంట్ మరొక కోవిడ్ వేవ్ కు దారితీస్తుందా?
ఫ్లూ వైరస్ లలో ముందుగా కనిపించేది గొంతు నొప్పి, మంటే. కరోనా వైరస్ లోనూ ఇదే ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాంతో రెండింటి మధ్య తేడాను గుర్తించడం కష్టం. అయితే, కరోనా వైరస్ ఎక్కువ కేసుల్లో గొంతునొప్పి నాలుగైదు రోజుల్లోనే తగ్గిపోతోంది. దీన్ని పరిశీలించుకోవాలి. ఈ లక్షణాల్లో ఏది కన్పించినా సొంత వైద్యం కాకుండా, వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవడమే మెరుగైన పరిష్కారం అవుతుంది.