Tenth Class Exams : తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. మే 11 నుంచి
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ని తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. మే 11 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Tenth Class Exams
Tenth Class Exams : కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో అన్ని పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమవుతోంది. తాజాగా పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ని తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. మే 11 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 20న చివరి ఎగ్జామ్ ఉంటుంది. 6 పేపర్లుగా ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి పేపర్ లో 80 మార్కులకు బోర్డ్ ఎగ్జామ్, 20 మార్కులకు ఇంటర్నల్ అసెస్ మెంట్ ఉంటుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా పరీక్షలకు అవసరమైన బందోబస్తు సమస్య తలెత్తకుండా ఇంటర్ పరీక్షలు ముగిసిన వారం రోజుల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు.
Reliance Jio New Plans : జియో యూజర్లకు అలర్ట్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు మారాయి.. చెక్ చేసుకోండి..!
గత రెండేళ్లుగా కరోనా కారణంగా రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసింది ప్రభుత్వం. తాజాగా కోవిడ్ తీవ్రత తగ్గి పరిస్థితులు అనుకూలించడంతో పరీక్షలను నిర్వహించడానికి బోర్డ్ మొగ్గు చూపింది. మరోవైపు థర్డ్ వేవ్ కూడా ముగిసిందని ఇటీవలే వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ సైతం ప్రకటన చేయడంతో పరీక్షల నిర్వహణకు అడ్డు తొలగింది.
టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్..
* మే 11న ఫస్ట్ లాంగ్వేజ్
* మే 12న సెకండ్ లాంగ్వేజ్
* మే 13న థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్)
* మే 14న మ్యాథమేటిక్స్
* మే 16న జనరల్ సైన్స్ పేపర్ (ఫిజిక్స్, బయోలాజికల్ సైన్స్)
* మే 17న సోషల్ స్టడీస్
* మే 18న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్)
* మే 19న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్)
* మే 20న ఎస్ఎస్‌సీ వొకేషనల్ కోర్స్ (థియరీ)
Melt Fat : ఈ 10 ఆహారాలతో కొవ్వు కరిగించేయండి!…
ఇటీవలే తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. అలాగే ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. అదే విధంగా మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.