బీఎడ్, డీఎడ్ అభ్యర్థులకు శుభవార్త.. తెలంగాణ టెట్ 2 నోటిఫికేషన్ విడుదల

జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది.

బీఎడ్, డీఎడ్ అభ్యర్థులకు శుభవార్త.. తెలంగాణ టెట్ 2 నోటిఫికేషన్ విడుదల

Updated On : November 4, 2024 / 2:21 PM IST

తెలంగాణలోని బీఎడ్, డీఎడ్ అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ టెట్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నెల 20 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో రెండోసారి టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మరోవైపు డీఎస్సీ నోటిఫికేషన్ వేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది.

జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. కాగా, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే ఓ సారి టెట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్‌ సర్కారు స్పష్టం చేసింది.

AP TET Results 2024: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. అర్హత సాధించిన 50.79శాతం మంది అభ్యర్థులు