Telangana : మూడు రోజుల వరకు వర్షాలు, జాగ్రత్త

తూర్పు గాలులతో ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, ఉత్తర కోస్తా ఆంధ్రా తీరం వరకు ఉపరితల ద్రోణి బలహీన పడిందన్నారు.

Telangana : మూడు రోజుల వరకు వర్షాలు, జాగ్రత్త

Tg Weather

Updated On : October 30, 2021 / 3:36 PM IST

Telangana Weather : వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతోంది. ఉదయం కాస్త ఎండగా ఉన్నా..మధ్యాహ్నం అయ్యేసరికి చల్లగా అయిపోతోంది. తూర్పుగాలుల ప్రభావం, ఉపరితల ద్రోణి కారణమని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తూర్పు గాలులతో ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, ఉత్తర కోస్తా ఆంధ్రా తీరం వరకు ఉపరితల ద్రోణి బలహీన పడిందన్నారు.

Read More : Huzurabad Bypoll : ఓటేసేందుకు క్యూ కట్టిన ఓటర్లు, 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్

శుక్రవారం ఆగ్నేయ బంగళాఖాతం పరిసర ప్రాంతాల్లోని శ్రీలంక, తమిళనాడు తీరాల్లో ఉన్న అల్పపీడనం శనివారం కూడా కంటిన్యూ అవుతోందన్నారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 3.1 కి.మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి స్థిరంగా కొనసాగుతూ ఉందన్నారు. రాగల 3 నుంచి 4 రోజుల్లో పశ్చిమ దిశ వైపు నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు. ఈశాన్య దిశ నుండి తెలంగాణా రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నట్లు వెల్లడించారు.

Read More : Etala Rajender : కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల

శనివారం, ఆదివారాల్లో తెలంగాణా రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడా మరియు ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సోమవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, తూర్పు గాలులు ప్రభావం వల్ల నవంబర్ నెల 02, 03 తేదీల్లో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.