Telangana Assembly : అసెంబ్లీ ముట్టడికి రైతులు, కాంగ్రెస్ నేతలు, బీజేపీ ఎస్సీ మోర్చా ప్రయత్నం

తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు, కాంగ్రెస్ నేతలు, బీజేపీ ఎస్సీ మోర్చా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

tension near Telangana Assembly‌ : తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు, కాంగ్రెస్ నేతలు, బీజేపీ ఎస్సీ మోర్చా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అసెంబ్లీలో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీపై తీర్మాణం చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న సీఎం కేసీఆర్‌ .. హామీ నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే ముట్టడికి యత్నించిన రైతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ.. కాంగ్రెస్‌ నేతలు అసెంబ్లీ ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పాటు మోతే కాలువ పనులను పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

అసెంబ్లీ ముట్టడికి దళితులు యత్నించారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. దళితులకు 3 ఎకరాల భూమిపై హామీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు.. దళితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు