TG 10th Supplementary Exams 2026 : విద్యార్థులకు బిగ్ అప్డేట్.. టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుంచే.. షెడ్యూల్ ఇదే.. హాల్ టికెట్స్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
TG 10th Supplementary Exams 2026 : రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరగనున్నాయి.
TG 10th Supplementary Exams 2026
- రేపటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు
- పరీక్షల షెడ్యూల్ వివరాలివే
TG 10th Supplementary Exams 2026 : రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ లింగయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు ప్రతీరోజూ ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 93 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 31,542 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్ కోర్సు) పరీక్ష మధ్యాహ్నం 12:50 వరకు ఉంటుందని, సైన్స్ పరీక్షలు (ఫిజికల్ సైన్స్, బయో లాజికల్ సైన్స్) రెండు వేర్వేరు రోజుల్లో ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు మాత్రమే జరుగుతాయని పేర్కొన్నారు.
హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని లేదంటే సంబంధిత స్కూల్ హెడ్మాస్టర్ నుండి పొందవచ్చని సూచించారు. అలాగే పరీక్ష కేంద్రాన్ని ముందురోజే చూసుకుంటే మంచిది.. పరీక్ష రోజు సమయానికి ఆందోళన తప్పుతుందని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థుల సందేహాల నివృత్తికోసం హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయంలో 24/7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, ఏవైనా సమస్యలు ఉంటే 040-23230942 నంబరు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చునని విద్యాశాఖ అధికారులు సూచించారు.
పరీక్ష షెడ్యూల్:
♦ జూన్ 5- ఫస్ట్ ల్యాంగ్వేజ్ (గ్రూప్ ఏ)
♦ జూన్ 6- సెకెండ్ ల్యాంగ్వేజ్
♦ జూన్ 7- థర్డ్ ల్యాంగ్వేజ్ (ఇంగ్లీష్)
♦ జూన్ 8- మ్యాథ్స్
♦ జూన్ 9- సైన్స్ పార్ట్1 (ఫిజిక్స్)
♦ జూన్ 10- సైన్స్ పార్ట్2 (బయోలజీ)
♦ జూన్ 11- సోషల్ స్టడీస్, ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్
♦ జూన్ 12- ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2
