boy died : ప్రాణం తీసిన ఈత సరదా…

మేడ్చల్‌ జిల్లాలోని మల్లంపేటలో ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. యశ్వంత్‌ అనే బాలుడు చెరువులో దిగి ఈత రాకపోవడంతో మరణించాడు.

boy died : ప్రాణం తీసిన ఈత సరదా…

Boy Dead

Updated On : March 31, 2021 / 1:36 PM IST

The boy fell into the pond and died : మేడ్చల్‌ జిల్లాలోని మల్లంపేటలో ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. యశ్వంత్‌ అనే బాలుడు చెరువులో దిగి ఈత రాకపోవడంతో మరణించాడు. అయితే యశ్వంత్‌ నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. రాత్రి వరకు గాలించిన తల్లిదండ్రులు.. రాత్రి 11 గంటల సమయంలో దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే చెరువు గట్టుపై యశ్వంత్‌ సైకిల్‌ను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చెరువులో గాలింపు చేపట్టిన పోలీసులు.. ఈ రోజు తెల్లవారుజామున యశ్వంత్‌ మృతదేహాన్ని గుర్తించారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.