Minister KTR : నల్లగొండకు రూ.18 వేల కోట్లు ఇస్తే.. పోటీ నుంచి తప్పుకుంటాం : మంత్రి కేటీఆర్‌

నల్లగొండ జిల్లాకు రూ. 18 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే మునుగోడు ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటామని.. అందుకు బీజేపీ సిద్ధమా అని మంత్రి కేటీఆర్‌ ప్రధాని మోదీని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనం కాదు… నల్లగొండ ప్రజల ప్రయోజనం ముఖ్యమని అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.

Minister KTR : నల్లగొండకు రూ.18 వేల కోట్లు ఇస్తే.. పోటీ నుంచి తప్పుకుంటాం : మంత్రి కేటీఆర్‌

Minister KTR

Updated On : October 12, 2022 / 2:00 PM IST

Minister KTR : నల్లగొండ జిల్లాకు రూ. 18 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే మునుగోడు ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటామని.. అందుకు బీజేపీ సిద్ధమా అని మంత్రి కేటీఆర్‌ ప్రధాని మోదీని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనం కాదు… నల్లగొండ ప్రజల ప్రయోజనం ముఖ్యమని అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.

‘‘ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశం సంపద పెరగదు. మరో వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదు. గుజరాత్‌కు గత ఐదు నెలల్లో రూ.80 వేల కోట్ల ప్యాకేజీలు. తెలంగాణకు కనీసం రూ.18వేల కోట్లు ఇవ్వలేరా..? నీతి ఆయోగ్‌ ఫ్లోరోసిస్‌ నిర్మూలన కోసం మిషన్‌ భగీరథకి రూ.19వేల కోట్లు కేటాయించామని సిఫార్సు చేస్తే పెడచెవిన పెట్టారు.

KTR-Komatireddy Venkatareddy : ‘కోవర్టు రెడ్లు’ అంటూ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్

రాజకీయ ప్రయోజనం కోసం ఓ వ్యక్తికి రూ.18వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు. మోడీ గారూ ఇప్పటికైనా నల్లగొండ జిల్లాకు రూ.18వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే పోటీ నుంచి తప్పుకుంటాం. బీజేపీ సిద్ధమా..?’’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.