bribe money burned : లంచం డబ్బును తగలబెట్టేశాడు..
లంచంగా తీసుకున్న డబ్బును ఓ మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు తగలబెట్టాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.

Bribe Money Burned
burned the bribe money : లంచంగా తీసుకున్న డబ్బును ఓ మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు తగలబెట్టాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వెల్దండ తహసీల్దార్ సైదులు గౌడ్ కోసం మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య గౌడ్ రూ.5 లక్షలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేశారు.
అధికారులను చూసిన వెంకటయ్య గౌడ్ లంచం డబ్బును తగలబెట్టాడు. క్రషర్ అనుమతి కోసం తహసీల్దార్ సైదులు రూ. 6 లక్షలు డిమాండ్ చేశారు. అయితే రూ. 5 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఈ నగదును వెంకటయ్య గౌడ్‌కు ఇవ్వాలని తహసీల్దార్ చెప్పారు.
నగదు తీసుకుంటున్న క్రమంలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని తహసీల్దార్ సైదులు గౌడ్ ఇంట్లో, అలాగే జిల్లెలగూడలోని వెంకటయ్య గౌడ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.